• సైట్ మ్యాప్
  • Accessibility Links
  • తెలుగు
ముగించు

ఐ.టి.డి.ఎ. పథకాలు

వ్యవసాయం

itdaagri

  1. గ్రామీణ పంటల అభివృద్ధి పథకం: చిన్న సన్నకారు రైతుల కు చెరకు, వేరుశనగ, పత్తి విత్తనాలు రాయతి పై సరఫరా.
  2. ఆర్.కే.వి.వై. పథకం క్రింద రైతుమిత్ర సంఘాలకు వ్యవసాయ యాంత్రికరణ కోసం వివిధ యంత్రాలు సబ్సిడీ పై అందించుట.
  3. జాతీయ ఆహార భద్రతా పథకం క్రింద వరి,అపరాలు, పంటలకు సంబందించిన ఉచిత మినీ విత్తన కిట్స్ సరఫరా / వారి ప్రదర్శన క్షేత్రాలు ఏర్పాటు మరియు దిగుబడి పెంపునకు అవసరమగు శిక్షణలు ఇవ్వబడును.

 పశుసంవర్దక శాఖ

ITDAah

AnimalHusbandry

  1. ముఖ్యమంత్రి పశు క్రాంతి పథకం: ఒక్కొక్క లబ్దిదారునికి 50% రాయితీ పై రూ. 60,000/- యూనిట్ విలువతో రెండు పది పశువులు అందజేయబడును.
  2. ముఖ్యమంత్రి జీవక్రాంతి పథకం: ఒక్కొక్క లబ్దిదారునికి 50% రాయితీ పై రూ. 3,000/- యూనిట్ విలువతో నెల్లూరు జాతి పొట్టేలు అందజేయబడును.
  3. అలాగే ఒక్కొక్క లబ్దిదారునికి 50% రాయితీ పై రూ.28,000/- యూనిట్ విలువతో 20 మగ గొర్రె పిల్లలు అందజేయబడును.
ఫిషరీస్
itdafish

ITDA Fish

  1. గిరిజన మస్త్యకారుల సంక్షేమం కొరకు ఉపకరణముల పంపిణి, వెండింగ్ యూనిట్స్, మోపెడ్స్ కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం 90% రాయతి తో జరుగుతుంది.
  2. ఆర్.కే.వి.వై. పథకం ద్వారా మోపెడ్లు, లగాజే ఆటోలు, ఐస్ బాక్సులతో సహా 90% రాయతితో సరఫరా చేయబడును.
  3. రెజెర్వాయర్ ప్రాంత గిరిజన మస్త్యకారులకు బోట్లు, వలలు మరియు సైకిళ్ళు 90% రాయతితో చేయబడును.
ఉద్యానవనం

itda-H

ITDA Horticulture

  1. పండ్ల తోటల విస్తరణ పథకం: 100% సబ్సిడీ పై మామిడి మరియు జీడి మొక్కల పెంపక పథకం.
  2. మామిడి మరియు జీడి పంట పెంపుదలకు 50% సబ్సిడీ పై ఎరువులు మరియు ఇతర పరికరాల పంపిణి.
  3. యాంత్రికరణ ధ్యేయంగా 50% సబ్సిడీ పై పవర్ టిల్లర్లు మరియు పవర్ స్ప్రేయర్లు పంపిణి.
  4. ఆయిల్ పామ్ అభివృద్దికి 75% సబ్సిడిపై మొక్కల పంపిణి, 50% సబ్సిడిపై ఎరువుల పంపిణి.
  5. 50% సబ్సిడీ పై అధికోత్పత్తి కూరగాయల విత్తనాల పంపిణి.

      ఆంధ్ర ప్రదేశ్ సూక్ష్మ నీటి పారుదల పథకం

  1. బిందు సేద్యం: అన్ని ఉద్యాన పంటలకు, పండ్ల తోటలకు ఈ పథకం ద్వారా 10% లబ్దిదారు వాటా తో 90% రాయితీ తో పరికరాల పంపిణి, షె.కు. మరియు షె.తె. పూర్తి రాయితీ (కుటుంబానికి 50,000 లు పరిమితి)
  2. తుంపరల సేద్యం: అపరాలను తక్కువ నీటి వినియోగం ద్వారా పండించుటకు ఈ కార్యక్రమం ఉద్దేశించబడినది. పై రాయితీ లే దీనికి వర్తించును.
ఎన్.టి.ఆర్. విద్యోన్నతి

itdaHE

ITDA Education

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  రాష్ట్రంలో SC & ST విద్యార్థులకు ప్రిలిమ్స్-కమ్-మెయిన్స్ కోసం UPSC నిర్వహించు  సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ల కోసం ప్రొఫెషనల్ శిక్షణ అందించడానికి ఒక కొత్త పథకం “ఎన్టీఆర్ విద్యోన్నతి ” ను ప్రవేశపెట్టింది. ఎన్నిక అయిన విద్యార్దులకు ప్రముఖ సంస్థలు ద్వారా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.

పథకం గురించి వివరమైన సమాచారం, సిలబస్ క్రింది వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి.

www.ntrvidyonnathi.org.

సాంకేతిక నైపుణ్య అభివృద్ధి 

క్రమ సంఖ్య కోర్స్ పేరు వ్యవధి అర్హత మగ / ఆడ
1 కంప్యూటర్ అసిస్టెంట్ 60 రోజులు 10th పాస్ మగ / ఆడ
2 సోలార్ టెక్నీషియన్ 90 రోజులు 10th పాస్ మగ / ఆడ
3 ప్లంబింగ్ 90 రోజులు 8th పాస్ ఆర్ ఫైల్ మగ
4 హోటల్ మేనజ్ మెంట్ 90 రోజులు 10th పాస్ ఆర్ ఫైల్ మగ / ఆడ
5 హార్డ్ వేర్ టెక్నీషియన్ 90 రోజులు 10th పాస్ మగ / ఆడ
6 రిటైల్ చైన్ కోర్స్ 90 రోజులు 10th పాస్ మగ / ఆడ
7 ప్లాస్టిక్ ఇంజనీరింగ్ టెక్నాలజీ 120 రోజులు 8th పాస్ మగ
8 వెల్డింగ్ 90 రోజులు 8th పాస్ ఆర్ ఫైల్ మగ
9 ఎలక్ట్రీషియన్ 90 రోజులు 8th పాస్ ఆర్ ఫైల్ మగ
10 సేవింగ్ మెషిన్ ఆపరేటర్ 60 రోజులు 8th పాస్ ఆర్ ఫైల్ ఆడ
11 డ్రైవింగ్ (ఎల్ యం వి ) 60 రోజులు 10th పాస్ ఆర్ ఫైల్ మగ
12 మొబైల్ టెక్నీషియన్ 60 రోజులు 10th పాస్ ఆర్ ఫైల్ మగ

 

ట్రైకార్ పథకం

 

ఇందులో భాగంగా గిరిజనులకు వివిధ పథకాల ద్వారా ఐ.టి.డి.ఎ. సబ్సిడీ తో (రూ.౩౦,౦౦౦ లు మించకుండా) ఋణములు మంజూరు చేయబడును. ఇందుకు గాను గ్రామ సభల ద్వారా లబ్దిదారుల ఎంపిక జరుగుతుంది. అట్లే వివిధ శాఖలు మంజూరు చేయు యూనిట్లు సంబందిత కమిటిల ద్వారా చేపట్టబడుతుంది. అలాగే ఒకసారి లబ్ది పొందినవారికి మరలా అవకాశం ఇవ్వబడదు.