శిధిలమైన పాఠశాల భవనాలను తొలగించాలి, జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి
ప్రచురణ తేది : 08/10/2021
పత్రికా ప్రకటన-5
శిధిలమైన పాఠశాల భవనాలను తొలగించాలి
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి
విజయనగరం, అక్టోబరు 06 ః జిల్లా వ్యాప్తంగా శిధిలమైన పాఠశాల భవనాలను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి ఆదేశించారు. విద్యాశాఖ, రాజీవ్ విద్యామిషన్, ఇంజనీరింగ్, సంక్షేమ శాఖల అధికారులతో బుధవారం ఆన్లైన్ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ సూర్యకుమారి మాట్లాడుతూ, జిల్లా అంతటా శిధిలమైన పాఠశాల భవనాలను, తరగతి గదులను ఇప్పటికే గుర్తించడం జరిగిందన్నారు. ప్రాధమిక పాఠశాల భవనాలు 290, ప్రాధమికోన్నత పాఠశాల భవనాలు 52, ఉన్నత పాఠశాల భవనాలు 167 పూర్తిగా కొన్ని, పాక్షికంగా కొన్నిదెబ్బతిన్నట్లు ప్రాధమికంగా జాబితాను రూపొందించడం జరిగిందన్నారు. వీటిని మండల విద్యాశాఖాధికారులు, ఇంజనీరింగ్ అధికారులు మరోసారి పరిశీలించి, తుది జాబితాను తయారు చేయాలని ఆదేశించారు. ఏయే పాఠశాలలను ఎక్కడికి తరలించాలో, వేటిలో విలీనం చేయాలో, ఆయా పాఠశాలల భవనాల పరిస్థితి, అక్కడి సమస్యలు తదితర వివరాలతో సమగ్ర నివేదికను రూపొందించాలని సూచించారు. పాఠశాలలను తరలించే సమయంలోగానీ, శిధిల భవనాలను తొలగించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలెక్టర్ పలు సూచనలు చేశారు.
ఈ కాన్ఫరెన్స్లో జిల్లా పరిషత్ సిఇఓ టి.వెంకటేశ్వర్రావు, జిల్లా విద్యాశాఖాధికారి సత్యసుధ, ఆర్విఎం అదనపు ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ స్వామినాయుడు, సర్వశిక్షా అభియాన్, ఎపిడిడబ్ల్యూఐడిసి, పంచాయితీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు, ఎంఇఓలు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
………………………………………………………………………………………………………………………………..
జారీ ః సహాయ సంచాలకులు, జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ, విజయనగరం.