ముగించు

కిషోర బాలికల పరిశుభ్రతే ధ్యేయంగా స్వేచ్చ జిల్లా కలెక్టర్ ఎ.సూర్య కుమారి

ప్రచురణ తేది : 08/10/2021

              కిషోర బాలికల పరిశుభ్రతే ధ్యేయంగా స్వేచ్చ

  • 7 నుండి 12 వ తరగతి  విద్యార్ధినులకు సానిటరీ  నాప్కిన్లు  సరఫరా
  • గ్రామీణ మహిళలకు చేయూత కేంద్రాల్లో లభ్యత –

 ఎం.ఎల్.ఎ బొత్స అప్పలనరసయ్య

  • తు సంబంధ సమస్యలు చదువుకు ఆటంకం కలగకూడదు                                                                                                               జిల్లా కలెక్టర్ ఎ.సూర్య కుమారి

విజయనగరం, అక్టోబర్ 05::  కిషోర బాలికల , మహిళల  ఆత్మ గౌరవాన్ని పెంపొందించ దానికే స్వేచ్చ అనే పధకాన్ని  అమలు చేస్తున్నట్లు   శాసన సభ్యులు బొత్స అప్పల నరసయ్య పేర్కొన్నారు.   రాష్ట్ర ముఖ్యమంత్రి  మంగళ వారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి వర్చువల్ ద్వారా స్వేచ్చ – కట్టుబాట్ల నుండి స్వేచ్చ లోనికి అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పధకం ద్వారా 7 వ తరగతి నుండి 12 వ తరగతి వరకు ప్రభుత్వ స్కూల్స్ , కాలేజీ లలో చదివే అమ్మాయిలకు నాణ్యమైన సానిటరీ నాప్కిన్లను  ఒక్కక్కరికి నెలకు 10 చొప్పున ఉచితంగా  పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

ఈ  వీడియో కాన్ఫరెన్స్ కు గజపతినగరం మండలం  పురిటి  పెంట  ప్రభుత్వ బాలికల పాఠశాల వద్ద  లైవ్  టెలికాస్ట్ ఏర్పాట్లను గావించారు.  ఈ కార్యక్రమానికి గజపతి నగరం శాసన సభ్యులు బొత్స అప్పల నరసయ్య, జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి, సంయుక్త కలెక్టర్ అభివృద్ధి డా. మహేష్ కుమార్ తదితరులు హాజరైనారు.  వీడియో కాన్ఫరెన్స్ అనంతరం శాసన సభ్యులు అప్పల నరసయ్య మాట్లాడుతూ   రుతు సంబంధ సమస్యలతోనే 23 శాతం మంది బడి మానివేసిన పిల్లల్లు ఉన్నట్లు  ఒక సర్వే లో తేలిందని,  రుత సంబంధ సమస్యలతో ఏ ఒక్కరూ బడి మాని  వేయ కూడదనే  ఉద్దేశ్యం తో ముఖ్య మంత్రి ఈ స్వేచ్చ కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు.   రాష్ట్రం లో ప్రతి ఒక్కరికి ఉచిత విద్య, పుస్తకాలు, బట్టల తో పాటు  అమ్మాయిలకు సానిటరీ నాప్కిన్ లను కూడా  అందించడం  గొప్ప విషయమని తెలిపారు.  అమ్మ ఒడి,  జగనన్న గోరు ముద్ద,   నాణ్యమైన మధ్యాహ్న భోజన పధకం ద్వారా  చదువుకు అత్యధిక ప్రాధాన్యత నివ్వడం జరుగుతోందన్నారు.  చేయూత స్టోర్స్ లో గ్రామీణ మహిళలకు కూడా సానిటరీ నాప్కిన్లను తక్కువ ధరకే అందించడం జరుగుతుందని తెలిపారు . తక్కువ ధరకే దొరుకుతున్నాయి కదా అని తక్కువుగా చూడొద్దని, టాప్ బ్రాండెడ్ కంపెనీ  అయినటువంటి ప్రోక్టర్ అండ్ గాంబిల్ , నైన్ కంపెనీ సరఫరా చేసే  నాణ్యమైన నాప్కిన్లని అన్నారు.    జిల్లాలో 548 పాఠశాలల్లోని  సుమారు 50 వేల మంది పిల్లలకు ఈ నాప్కిన్లను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.  పిల్లల ఆరోగ్యం పై రాజీ పడకూడదని, అందరూ విద్యవంతులైతేనే, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి కూడా భవిషత్తు లో బాగుంటుందణి ముఖ్యమంత్రి భావిస్తున్నారని పెరోన్నారు.

నాప్కిన్ల వినియోగం, డిస్పోజ్ పై ఉపాధ్యయులే అవగాహన కలిగించాలి; జిల్లా కలెక్టర్

రుతు సంబంధ  సమస్యల వలన విద్యకు ఎలాంటి ఆటంకం కలగరాదని జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి తెలిపారు.  తల్లీ తండ్రి తర్వాత  ఉపాధ్యాయులే తొలి గురువులని, వారు చెప్పేదానిని విద్యార్ధులు తప్పక పాటిస్తారని, సానిటరీ నాప్కిన్ల వినియోగం, డిస్పోజల్ తదితర అంశాల పై ఉపాధ్యాయులే పిల్లలకు అవగాహన కలిగించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.  అమ్మాయిలు వారి లో నున్న సమస్యలను చెప్పుకోడానికి సంకోచిస్తుంటారని,  వారి సందేహాలను, సంకోచాలని పారద్రోలి స్వేచ్చగా ఉపాధ్యాయులతో చెప్పుకునే పరిస్థితిని కల్పించాలని అన్నారు.  అనేక గర్భ శ్రావాలకు , బరువు తక్కువ పిల్లలు జన్మించడానికి మహిళల పరిశుభ్రత, ఆహారం, ఆరోగ్యం కారణాలని వాటిని అధిగమించడానికి ఇప్పట్నుంచే వారికీ అన్ని అంశాల పట్ల అవగాహన కలిగించాలన్నారు.  ఫోర్టిఫైడ్ బియ్యాన్ని గ్రామాల్లో పౌర సరఫరా ద్వారా అందించడం జరుగుతోందని,  ఈ బియ్యం లో ఐరన్, ఫోలిక్ ఉంటాయని, రక్త హీనత రాకుండా దోహద పడతాయని వీటిని తప్పక వినియోగించాలని పిల్లలే పెద్దలకు చెప్పాలని అన్నారు.  ప్రతి ఒక్కరు దిశా యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని, మగ వారు కూడా చేసుకుంటే అత్యవరస పరిస్థితుల్లో అమ్మాయిల్ని ఆపద నుండి రక్షించ వచ్చని అన్నారు.  ప్రతి ఒక్కరు వాక్సినేషన్ వేసుకొని కోవిడ్ బారిన పడకుండా ఉండాలని కోరారు.

        సంయుక్త కలెక్టర్ డా. మహేష్ కుమార్ మాట్లాడుతూ  పదేళ్ళు నిండిన తర్వాత బాలికల్లో శరీరం లో హార్మోన్ల  వలన రుతు సంబంధ సైకిల్ ప్రారంభం అవుతుందని, ఇది అత్యంత సాధారణ విషయమని అన్నారు.  నెలసరి  రావడం వలన ఇమ్మ్యూనిటి తగ్గుతుందని, మంచి ఆహారం తో పాటు, శారీరక పరిశుభ్రత అవసరమని అన్నారు.   పునరుత్పతి ట్రాక్ ఇన్ఫెక్షన్లు, యూరినరి ట్రాక్ ఇన్ఫెక్షన్లు, ఈస్ట్ మరియు బాక్టీరియా ల  ఇన్ఫెక్షన్లు వచ్చే అకాశం ఉంటుందన్నారు.  పిల్లలు తల్లులతో, ఉపాధ్యాయులతో వారి సమస్యల పట్ల చర్చించుకోవాలని అన్నారు.

        ఈ కార్యక్రమం లో  ఐ.సి.డి.ఎస్.ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజేశ్వరి, జిల్లా విద్య శాఖా ధికారి సత్య సుధ, సర్వ శిక్షా అభియాన్ ఎ.పి.సి డా. స్వామి నాయుడు, మెప్మా పి.డి సుధాకర రావు,  ఎం.పి.పి బెల్లన జ్ఞాన జ్యోతి, సర్పంచ్ విజయలక్ష్మి,  ఎం.పి.టి.సి లు, విద్య కమిటి చైర్మన్, ప్రధాన ఉపాధ్యాయులు తర్దితరులు పాల్గొన్నారు.

———————————————————————————————————————

జారి: సహాయ సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ, విజయనగరం.

Swachha District Collector A. Surya Kumari aims at the hygiene of teenage girls