08.12.2025-సాయుధదళాల పతాక నిధికి విరాళం–జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి
Publish Date : 09/12/2025
పత్రికా ప్రకటన
సాయుధ దళాల పతాక నిధికి విరాళం
–జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి
విజయనగరం, డిసెంబర్ 08: ఈ నెల ఏడవ తేదీన జాతీయ సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో సోమవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి సాయుధ దళాల పతాక నిధికి విరాళం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,
దేశ రక్షణ కోసం ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందిస్తున్న సైనికులకు, మాజీ సైనికులకు, వారి వారి కుటుంబ సభ్యులకు పతాక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. యుద్ధాల్లో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ఆయన శ్రద్ధాంజలి ఘటించారు.
దేశ భద్రత కోసం నిరంతరం కృషి చేస్తున్న సైనికుల సంక్షేమార్థం అందరూ వారి సామర్థ్యానికి తగ్గట్టు విరాళాలు అందించి, పతాక నిధికి సహకరించాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమ అధికారి ప్రసాద్ రావు మరియు సిబ్బంది, ఎన్సిసి అధికారులు, సిబ్బంది, మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
==============
జారీ : జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి విజయనగరం

8-12-1

8-12-2