News
The finals of the competition were held on Saturday evening at Shilparam. District Education Officer K.Venkateswara Rao presented certificates of appreciation to the winners of the competitions
Published on: 24/08/2022విజేతలకు బహుమతి ప్రదానం విజయనగరం, ఆగస్ట్ 14: వివిధ పోటీల విజేతలకు విద్యా శాఖ ఆధ్వర్యంలో బహుమతి ప్రదానం శనివారం సాయంత్రం రాజీవ్ స్టేడియంలో జరిగింది. ఆజాది కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా, జిల్లా కలెక్టర్ సూర్యకుమారి ఆదేశాల మేరకు, విద్యార్థులకు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో వ్యాసరచన, వక్తృత్వ, చిత్ర లేఖనం, మోనో యాక్షన్ తదితర పోటీలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. ఈ పోటీల ఫైనల్స్ శనివారం సాయంత్రం శిల్పారామంలో జరిగాయి. […]
Let’s pave the way for development with collective efforts, the fruits of freedom should be shared equally, Azadi Ka Amrit Mahotsava is celebrated throughout the district, Happy Independence Day to all the people, District Collector Surya Kumari
Published on: 24/08/2022సమష్టి కృషి తో అభివృద్ధికి బాటలు వేద్దాం స్వాతంత్ర్య ఫలాలు సమానంగా అందాలి జిల్లా అంతటా ఘనంగా ఆజాది క అమృత్ మహోత్సవాలు ప్రజలందరికీ స్వాంతత్య్ర వజ్రోత్సవ శుభాకాంక్షలు జిల్లా కలెక్టర్ సూర్య కుమారి విజయనగరం, ఆగస్ట్ 14:: అన్ని వర్గాల ప్రజలకు స్వాతంత్ర్య ఫలాలు సమానంగా అందించి, సమష్టి కృషి తో జిల్లా అభివృద్ధికి పాటు పడాలని జిల్లా కలెక్టర్ సూర్య కుమారి ఆకాంక్షించారు. ప్రజలంతా స్వేచ్ఛ, సమనత్వాలను పొందుతూ అన్ని రంగాలలో అభివృద్ధి చెంది ఆర్ధిక సాధికారతను సాధించాలన్నారు. 75 వ స్వాతంత్ర్య దినోత్సవం […]
Covid vaccination should be intensified, villagers should be reached under family doctor system, district collector orders for medical officers
Published on: 24/08/2022కోవిడ్ వ్యాక్సినేషన్ ముమ్మరం చేయాలి ఫ్యామిలీ డాక్టర్ విధానంలో గ్రామీణులకు చేరువ కావాలి వైద్యాధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు విజయనగరం, ఆగష్టు 12 :రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆగష్టు 15 నుంచి ప్రారంభిస్తున్న ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా గ్రామీణులకు చేరువై వారికి సేవలందించే గొప్ప అవకాశం వైద్యులకు లభించిందని, ఈ అవకాశం వినియోగించుకొని వారికి సేవలందించడం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజల మెప్పుపొందేలా వైద్యాధికారులు ప్రయత్నించాలని జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి పిలుపు నిచ్చారు. ఈ విధానంలో వైద్యులు ఉదయం వేళల్లో ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో […]
Excited enthusiasm.. Vadawadala flag ceremony, three-pointed flag fluttering on the streets of Vijayanagara, lively Harghar Tiranga Utsava rallies, hundreds of students from different schools, students, ethnic unity, Chatamari Suryasemanna Collector A.
Published on: 12/08/2022ఉప్పొంగిన ఉత్సాహం.. వాడవాడలా పతాక సంబరం *విజయనగరం వీధుల్లో రెపరెపలాడిన మువ్వెన్నల జెండా *ఉత్సాహంగా సాగిన హర్ ఘర్ తిరంగా ఉత్సవ ర్యాలీలు *వందలాదిగా విచ్చేసిన వివిధ పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులు *జాతి సమైక్యతను చాటి చెప్పాలన్న కలెక్టర్ ఎ. సూర్యకుమారి విజయగనరం, ఆగస్టు 12 ః భారత్ మాతాకీ జై అనే నినాదాలతో నగర వీధులన్నీ మార్మోగిపోయాయి. మువ్వెన్నల జెండా రెపరెపలతో వర్ణశోభితంగా మారాయి. స్వతంత్రం.. స్వతంత్రం అంటూ సాగిన ర్యాలీలు పుర ప్రజల్లో స్ఫూర్తి నింపాయి. ఆజాదీ కా అమృత్ […]
Perpetual right to lands with Resurvey, Special Chief Secretary Ajay Kallam visits Pusapatirega Mandal in Poram
Published on: 12/08/2022రీసర్వే తో భూములకు శాశ్వత హక్కు స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ అజయ్ కళ్లం పూసపాటిరేగ మండలం పోరాంలో పర్యటన పూసపాటిరేగ, (విజయనగరం), ఆగస్టు 11ః ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన లాండ్ రీ సర్వే ప్రక్రియ ద్వారా భూములకు శాశ్వత హక్కు లభిస్తుందని, ముఖ్యమంత్రి స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ అజయ్ కళ్లం అన్నారు. సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ సిద్దార్ధ్ జైన్‌తో కలిసి పూసపాటిరేగ మండలం పోరాంలో ఆయన గురువారం పర్యటించారు. పైలట్ ప్రాజెక్టు క్రింద గ్రామంలో […]
Last date for recruitment of contract jobs in model schools, application deadline is 17th August
Published on: 12/08/2022మోడల్ స్కూల్స్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీ దరఖాస్తులకు చివరితేదీ ఆగస్టు 17 విజయనగరం, ఆగస్టు 11 ఃమోడల్ స్కూల్స్‌లో కాంట్రాక్ట్ పద్దతిలో పనిచేసేందుకు పిజిటి, టిజిటి పోస్టులను భర్తీ చేయడానికి, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు, జిల్లా విద్యాశాఖాధికారి (ఇన్‌ఛార్జి) కె.వెంకటేశ్వర్రావు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు జోన్లు కలిపి టిజిటి-71, పిజిటి-211, మొత్తం 282 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఈ పోస్టులను భర్తీ చేయడానికి ఈ నెల 5వ తేదీన నోటిఫికేషన్ విడుదల కాగా, 8వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ఆన్‌లైన్లో మొదలయ్యిందని, ఈ నెల 17వ […]
Byjus training for JEE, NEET, training will start from 16th of this month, teaching of moral values will also be given priority, District Collector A. Suryakumari
Published on: 12/08/2022జెఇఇ, నీట్‌కు బైజూస్ శిక్షణ ఈనెల 16 నుంచి శిక్షణ ప్రారంభం నైతిక విలువల బోధనకూ ప్రాధాన్యత జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి విజయనగరం, ఆగస్టు 11 ః జిల్లా విద్యార్థులకు ఒక గొప్ప అవకాశం లభించింది. జిల్లాకు చెందిన 50 మంది ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేసి, వారికి జెఇఇ, నీట్ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు ప్రముఖ అంతర్జాతీయ ఎడ్యుకేషనల్, టెక్నో కంపెనీ బైజూస్ ముందుకు వచ్చినట్లు జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు బైజూస్ సంస్థ ఉచితంగా ట్యాబ్‌లను అందజేస్తుందన్నారు. నీతి అయోగ్ ఏస్పిరేషనల్ జిల్లా కావడంతో, విజయనగరం జిల్లా […]
Services from family physician, wellness center or secretariat from August 15, measures to control fever should be taken, District Collector A. Suryakumari
Published on: 12/08/2022ఆగస్టు 15 నుంచి ఫ్యామిలీ ఫిజీషియన్ వెల్‌నెస్ సెంటర్ లేదా సచివాలయం నుంచి సేవలు జ్వరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి విజయనగరం, ఆగస్టు 10 ః ఆగస్టు 15 నుంచి ఫ్యామిలీ ఫిజీషియన్ (ఫ్యామిలీ డాక్టర్) సేవలను ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి ఆదేశించారు. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రాలు లేదా సచివాలయాలనుంచి ఈ సేవలను అందించనున్నట్లు తెలిపారు. జిల్లా అధికారులు, వైద్యారోగ్య శాఖాధికారులతో తన ఛాంబర్‌లో బుధవారం సమావేశాన్ని నిర్వహించారు. ఫ్యామిలీ ఫిజీషియన్ సేవలు, సీజనల్ వ్యాధుల నియంత్రణ, కోవిడ్ వేక్సినేషన్, వైద్యారోగ్యశాఖలో […]
Street children should be protected, District Collector Surya Kumari
Published on: 10/08/2022వీధి బాలలను సంరక్షించాలి జిల్లా కలెక్టర్ సూర్య కుమారి విజయనగరం, ఆగస్టు 10:: బాలలు పాఠశాలలు లేదా గృహాలలో ఉండాలని, వీధుల్లో ఉండకూడదని, అలా ఉండేవారిని సంరక్షణా గృహాలలో ఉంచి పాఠశాలల్లో చేర్పించాలని జిల్లా కలెక్టర్ సూర్య కుమారి తెలిపారు. అదే విధంగా బాల కార్మికులను గుర్తించాలని, బాల్య వివాహాలను అడ్డుకోవాలని అన్నారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్ లో బాలల సంక్షేమ సమితి త్రై మాసిక సమీక్ష సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాలల న్యాయ రక్షణ, సంరక్షణ చట్టాన్ని అనుసరించి […]
District Revenue Officer M. Ganapathirao stated that apart from money and property, moral values should be given as inheritance to the future generations and they should be informed about the life characteristics of freedom fighters.
Published on: 10/08/2022*భావితరాలకు నైతిక విలువలను వారసత్వంగా అందించాలి* *జిల్లా రెవెన్యూ అధికారి ఎం. గణపతిరావు *స్వాతంత్య్ర సమరయోధుల వారసులకు ఆత్మీయ సత్కారం విజయనగరం, ఆగస్టు 09 ః భావితరాలకు డబ్బు, ఆస్తులు కాకుండా నైతిక విలువలను వారసత్వంగా అందించాలని, స్వాతంత్య్ర సమరయోధుల జీవిత విశేషాలను వారికి తెలియజేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం. గణపతిరావు పేర్కొన్నారు. నేటి తరం యువతకు చరిత్ర గురించి తెలియజేస్తూ స్వాతంత్య్ర స్ఫూర్తిని నింపాలని సూచించారు. మానసిక పరివర్తన పెంపొందేలా, సామాజిక అంశాలపై అవగాహన […]