Close

దివ్యాంగ విద్యార్థులకు అవసరమైన ఉపకరణములను పంపిణీ

Publish Date : 11/11/2025

విజయనగరం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో 1 వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న (0-18) సంవత్సరాల మధ్య  వయసు గల  దివ్యాంగ విద్యార్థులకు అవసరమైన ఉపకరణములను పంపిణీ చేయుటకు అర్హులైన విద్యార్థులను గుర్తించు నిమిత్తం నియోజకవర్గ స్థాయిలో వైద్య శిబిరాలు క్రింది పేర్కొన్న తేదీలలోనిర్వహించబడనున్నాయి.

వరుస సంఖ్య అసెంబ్లీ  నియోజక వర్గం పేరు వైద్యశిభిరం నిర్వహించనున్న స్థలంపేరు అసెంబ్లీ  నియోజక వర్గం లో వుండే మండలాల పేర్లు వైద్య శిభిరం నిర్వహించనున్న తేది
1 గజపతినగరం గజపతినగరం గజపతినగరం 10.11.2025
దత్తిరాజేరు
మెంటాడ
బొండపల్లి
గంట్యాడ
2 బొబ్బిలి రామభద్రపురం రామభద్రపురం 11.11.2025
బొబ్బిలి
బాడంగి
తెర్లాం
3 రాజాం రాజాం రాజాం 12.11.2025
ఆర్.ఆముదాలవలస
వంగర
సంతకవిటి
4 చీపురుపల్లి గరివిడి గుర్ల 13.11.2025
గరివిడి
చీపురుపల్లి
మెరకముడిదం
5 విజయనగరం &    నెల్లిమర్ల డెంకాడ డెంకాడ 14.11.2025
భోగాపురం
పూసపాటిరేగ
విజయనగరం
నెల్లిమర్ల
6 ఎస్.కోట ఎస్.కోట ఎస్.కోట 15.11.2025
జామి
కొత్తవలస
వేపాడ
ఎల్.కోట

దివ్యాంగ విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల అర్హత నిర్ధారణ కోసం క్రింది ధృవపత్రాలతో తప్పనిసరిగా హాజరు కావలసిందిగా కోరడమైనది.

వైద్య శిబిరంనకు తీసుకొని రావలసిన  ధృవపత్రాలు:

  1. విద్యార్థి యొక్క ఆధార్ కార్డు
  2. సదరం సర్టిఫికేట్
  3. UDIDకార్డు
  4. రేషన్ కార్డు / ఆదాయ ధృవపత్రం
  5. విద్యార్థి ఫోటో

ఈ వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకొని, దివ్యాంగ విద్యార్థులు ఉపకరణాల పంపిణీ కార్యక్రమానికి అర్హత సాధించగలరని తెలియజేయడమైనది.

అదనపు పధక సమన్వయకర్త,

  సమగ్ర శిక్ష, విజయనగరం.