Close

We should achieve sustainability in poverty eradication*– District Collector S. Ramsunder Reddy

Publish Date : 25/10/2025

పేదరిక నిర్మూలనలో సుస్థిరిత సాధించాలి*

— జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి

విజయనగరం, అక్టోబర్ 24:  జిల్లాలో పేదరిక నిర్మూలన దిశగా డిఆర్డిఎ చేస్తున్న కార్యక్రమాలు సుస్థిరత సాధించే దిశగా చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి సూచించారు. శుక్రవారo కలెక్టరేట్ సమావేశమందిరం లో జరిగిన డిఆర్డిఎ, మెప్మా సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ,  ఎస్ హెచ్ జి లకు అవసరమైన శిక్షనలు ఇవ్వడం ద్వారా వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు, ప్రస్తుతం ఆర్. సెటి, సీడాప్, డిడియు- జికెవై  ద్వారా ఇస్తున్న శిక్షనలతో పాటు జిల్లా సమైఖ్యల ద్వారా కూడా శిక్షణలు ఇవ్వాలని సూచించారు. సుమారు 82 వేల బంగారు కుటుంబాలు గుర్తించడం జరిగిందని, సెర్ఫ్ కార్యకలాపాలు కూడా పి 4 కు అనునంధానం చేసి  మార్గదర్శిలుగా చేయాలని కలెక్టర్ సూచించారు.

            మెప్మా కార్యక్రమాలు విస్తృత పరచాలని, బ్యాంక్ రుణాలతో పాటు స్వయం ఉపాధి కల్పించాలని ఆదేశించారు.  స్వయం ఉపాధిలో కొత్త యూనిట్లను స్థాపించడంతో పాటు, ఉన్నవాటిని బలోపేతం చేయాలని ఆదేశించారు.

            కార్యక్రమంలో భాగంగా స్త్రీ నిధి ఋణం నెలవారీ చెల్లించ వలసిన రుణ వాయిదాల వివరాలతో కూడిన స్త్రీ నిధి గోడ పత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు.

            ఈ సమావేశంలో సిపిఒ బాలాజీ, డిఆర్డిఎ పిడి శ్రీనివాస్ ఫణి, మెప్మా పిడి చిట్టి రాజు  తదితరులు పాల్గొన్నారు.

========================

జారీ :  జిల్లా స‌మాచార పౌర సంబంధాల అధికారి, విజ‌య‌న‌గ‌రం

2410-A

2410-A