Close

మండ‌లానికి వెయ్యిమందికి తక్కువ కాకుండా ఉపాధి ప‌ని, జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి

Publish Date : 11/11/2025

మండ‌లానికి వెయ్యిమందికి తక్కువ కాకుండా ఉపాధి ప‌ని

జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి

విజ‌య‌న‌గ‌రం, న‌వంబ‌రు 07 ః  ప్ర‌తిరోజూ మండ‌లంలో క‌నీసం వెయ్యిమందికి త‌క్కువ కాకుండా ఉపాధిప‌నుల‌ను క‌ల్పించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. మ‌హాత్మా గాంధీ గ్రామీణ ఉపాధిహామీ ప‌థ‌కం అమ‌లుపై శుక్ర‌వారం టెలీకాన్ఫ‌రెన్స్ ద్వారా సంబంధిత అధికారుల‌తో స‌మీక్షించారు. ప‌నుల పుర‌రోగ‌తిని తెలుసుకున్నారు.

                 ఈ సమావేశ‌మంలో క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ, ఉపాధిహామీ ప‌నుల వేగాన్ని పెంచాల‌ని, ప‌నిలో పాల్గొనే వేత‌న‌దారుల‌ను సంఖ్య‌ను గ‌ణ‌నీయంగా పెంచాల్సి ఉంద‌ని చెప్పారు. ముఖ్యంగా త‌క్కువ ప్ర‌గ‌తి ఉన్న మండ‌లాల‌పై ప్ర‌త్యేక దృష్టి సారించి, ప‌నుల వేగాన్ని పెంచాల‌ని సూచించారు. వంద‌రోజుల ప‌నిక‌ల్ప‌న‌లో వెనుక‌బ‌డిన మండ‌లాల‌పై అసంతృప్తిని వ్య‌క్తం చేశారు. ప‌నితీరు మెరుగుప‌డాల‌ని ఆదేశించారు. అన్ని మండ‌లాల్లో ఫారం పాండ్స్ ప‌నులను వేగంగా పూర్తి చేయాల‌ని చెప్పారు. వ‌చ్చేవారం నాటికి క‌నీసం 20 శాతం ప‌నుల‌నైనా మొద‌లు పెట్టాల‌ని ఆదేశించారు. హార్టీ క‌ల్చ‌ర్‌, అవెన్యూ ప్లాంటేష‌న్‌, బ్లాక్ ప్లాంటేష‌న్ ప‌నుల‌కు ప్ర‌తిపాద‌న‌లు సిద్దం చేసి, 12వ తేదీ త‌రువాత ఆమోదం తీసుకోవాల‌ని సూచించారు. ఈ వారాంతానికి ఈ కెవైసి ప‌నుల‌ను 95 శాతం పూర్తి చేయాల‌ని ఆదేశించారు. స‌రాస‌రి వేత‌నం పెంచేందుకు అన్ని రకాల చ‌ర్య‌లూ తీసుకోవాల‌ని, వారానికి క‌నీసం 10 రూపాయ‌లైనా పెరిగేలా చూడాల‌ని క‌లెక్ట‌ర్‌ సూచించారు.

              టెలికాన్ఫ‌రెన్స్‌లో డ్వామా పిడి ఎస్‌.శార‌దాదేవి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

………………………………………………………………………………………………………

జారీ ః జిల్లా స‌మాచార పౌర సంబంధాల శాఖాధికారి, విజ‌య‌న‌గ‌రం.

1111-A

1111-A