రాష్ట్రమంత్రి కొండపల్లి శ్రీనివాస్ జల్లాస్థాయి అండర్-14 అథ్లెటిక్స్ ప్రారంభం
Publish Date : 07/11/2025
పత్రికా ప్రకటన
శారీరక మానసిక ఆరోగ్యానికి క్రీడలు దోహదం
రాష్ట్రమంత్రి కొండపల్లి శ్రీనివాస్
జల్లాస్థాయి అండర్-14 అథ్లెటిక్స్ ప్రారంభం
బొండపల్లి (విజయనగరం), నవంబరు 06 ః
శారీరక మానసిక ఆరోగ్యానికి క్రీడలు దోహదం చేస్తాయని రాష్ట్ర చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలు, సెర్ప్, ఎన్నారై సాధికారతా సంబంధాల శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. బొండపల్లి మండలంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో అండర్-14 అథ్లెటిక్స్ పోటీలను ఆయన గురువారం ప్రారంభించారు. విద్యార్థుల మార్చ్‌ఫాస్ట్‌ను తిలకించారు. క్రీడాజ్యోతిని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, క్రీడలవల్ల శారీరక ధారుడ్యం ఏర్పడుతుందనని అన్నారు. అలాగే మానసిక వికాసం, క్రీడా స్ఫూర్తి అలవడుతుందని చెప్పారు. శరీరం ధృఢంగా ఉంటే, మానసికంగా కూడా ధృఢంగా ఉంటారని సూచించారు. అదేవిధంగా క్రీడల్లో రాణించడం ద్వారా మంచి ఉద్యోగాలను కూడా పొందవచ్చునని చెప్పారు. క్రీడాకారులకు ప్రత్యేకంగా రిజర్వేషన్లు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
జిల్లా విద్యాశాఖాధికారి యు.మాణిక్యంనాయుడు మాట్లాడుతూ, క్రీడాపోటీల నిర్వహణ వెనుకనున్న ఉద్దేశాన్ని వివరించారు. క్రీడలు ప్రతీవ్యక్తి జీవితంలో భాగం కావాలని కోరారు. క్రీడలు కేవలం పతకాలు, ర్యాంకులకోసమే కాకుండా, చక్కని ఆరోగ్యాన్ని పొందేందుకు సాధనాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంఈవో అల్లు వెంకట రమణ, విద్యా కమిటి ఛైర్మన్ బాలి వెంకట రమణ,ప్రధానోపాధ్యాయులు ఉమామహేశ్వరరావు,మండలంలోని వివిధ విభాగాల అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు
……………………………………………………………………………………………………..
జారీ ః జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖాధికారి, విజయనగరం.


071125-B


071125-D