Close

విజయనగరంలోరబీ సీజనుకు సరిపడా యూరియా, జిల్లా వ్యవసాయ అధికారి

Publish Date : 12/12/2025

విజయనగరంలో రబీ సీజనుకు సరిపడా యూరియా

  • విజయనగరం జిల్లాకు రబీ 2025-26గాను, అన్ని పంటలకు అవసరమైన 26 వేల  మెట్రిక్ టన్నుల యూరియాఎరువు  పంపిణీకి ప్రణాళిక చేయడమైనది .
  • 01.10.2025 నాటికి 1295 మెట్రిక్ టన్నుల యూరియా ప్రారంభనిల్వలు అందుబాటులో ఉన్నాయి.
  • 01.10.2025నుండి31.12.2025 వరకు విజయనగరం జిల్లాకుమొత్తం10,660 మెట్రిక్ టన్నుల అవసరం కాగా,ఇప్పటికే8058మెట్రిక్ టన్నుల యూరియా నురైతులకు అందుబాటులో ఉంచడం జరిగింది మరియుఈడిసెంబర్ఆఖరికిఇంకనూ2600 మెట్రిక్ టన్నులు జిల్లాకురానున్నది.
  • 01.10.2025 నుండి 10.12.2025వరకు జిల్లా లో మొత్తం 5110  మెట్రిక్ టన్నుల యూరియా విక్రయాలు జరిగినవి.
  • 11.12.2025 నాటి నుండిరాబోయే21 రోజులకుగాను3500మెట్రిక్ టన్నుల యూరియా అవసరంకాగా, ప్రస్తుతం ఈ రోజు నాటికి ) 3058 మెట్రిక్ టన్నులను  యూరియానుఆర్.ఎస్.కె లలో, మార్క్ ఫెడ్ గోదాములలో,రిటైల్/హోల్ సేల్మరియు కంపెనీ గోదాములలో ఎరువునురైతాంగానికి అందుబాటులో ఉన్నవి.
  • జిల్లా లో ఇప్పటివరకు ఎటువంటి ఎరువుల కొరత లేదు. దేశీయంగా ఉన్న అన్ని ఎరువుల కర్మాగారాలు ఉత్పత్తి చేయుచున్నవి. అలాగే విదేశాలనుండి కూడా అవసరమైన యూరియా దిగుమతులు సంతృప్తి కరంగా ఉన్నవి. కనుక రాబోయే పంట కాలం లో  కూడా యూరియా కు ఎటువంటి కొరత రాదని తెలియపరచడమైనది .జిల్లాకు ఎప్పటికప్పుడు విశాఖపట్నం పోర్టు నుండి , రైల్ మరియు  రోడ్డు మార్గాల ద్వారా , యూరియా సరఫరా జరుగుతోంది.
  • నూతనంగా రూపొందించి బడిన సాంకేతికంగా అభివృధి పరచిన నానో యూరియా , నానో డి.ఎ.పి ఎరువులను అందుబాటులోకి తీసుకురావడం జరిగినది.ఇవి సాంప్రదాయ ఎరువులకు నూరు శాతం ప్రత్యామ్నాయంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని ప్రోత్సాహిస్తున్నాయి.
  • కావున, రైతు సోదరులకు తెలియచేయడం ఏమనగా, ఎరువులను కొనుగోలు చేయునప్పుడు బస్తా పై ముద్రించిన ఎం.ఆర్. పి  ధరలను చూసుకుని, దాని ప్రకారము పైకము చెల్లించి, తప్పని సరిగా డీలరు నుండి రసీదు పొందవలెను.
  • ఎవరైనా డీలర్లు నిబంధనలు ఉల్లంఘించి, ఎరువుల కృత్రిమ కొరత సృష్టించినా ,ఎరువులను మళ్లింపుచేసిన, ఎం ఆర్ పి  ధరల కంటే ఎరువులను అధిక ధరలకు విక్రయించిన యెడల, వారి యొక్క లైసెన్స్ లు రద్దు చేసి, ఎరువుల నియంత్రణ చట్టం 1985, ప్రకారంవారిపై కఠిన చర్యలు తీసుకొనబడునుఅనిజిల్లా వ్యవసాయ అధికారి వి.టి. రామారావు తెలియజేసారు.

 

జిల్లా వ్యవసాయ అధికారి,

వ్యవసాయశాఖ,

విజయనగరం జిల్లా