విజయనగరం జిల్లాలో గ్రామీణ రోడ్లు బ్రిడ్జిల నిర్మాణానికి రూ. 84.62 కోట్లతో పనుల మంజూరు – రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జిల్లాలో 67 పనులను మాంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వఓ, సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న బ్రిడ్జిల నిర్మాణానికి అనుమతులు మంజూరు, కా
Publish Date : 10/12/2025
విజయనగరం జిల్లాలో గ్రామీణ రోడ్లు బ్రిడ్జిల నిర్మాణానికి రూ. 84.62 కోట్లతో పనుల మంజూరు – రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్
జిల్లాలో 67 పనులను మాంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వo.
సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న బ్రిడ్జిల నిర్మాణానికి అనుమతులు మంజూరు
కార్యరూపం దాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ
విజయనగరం: 9-12-2025: విజయనగరం జిల్లాలో పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో ఉన్న గ్రామీణ రోడ్లకు మహర్దశ పట్టనుందని, గత ప్రభుత్వ హయాంలో మరమత్తులకు నోసుకొని పంచాయతీరాజ్ రోడ్లను నిర్మించేందుకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారని సూక్ష్మ, చిన్న,మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత, సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకం స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ (సాస్కి) నిధులతో జిల్లా వ్యాప్తంగా 67 పనులకు రూ. 84.62 కోట్లతో జిల్లాలో రోడ్లను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన పరమైన అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా బొబ్బిలి నియోజకవర్గం లోని 8 పనులకు, చీపురుపల్లి నియోజకవర్గంలో 10 పనులకు, గజపతినగరం నియోజకవర్గంలో 7 పనులకు, నెల్లిమర్ల నియోజకవర్గంలో 17 పనులకు,రాజాం నియోకవర్గంలో 6 పనులకు, ఎస్ కోటలో 7 పనులకు, విజయనగరంలో 12 పనులకు అనుమతులు దక్కాయని, ఈ నిధులతో రహదారులు, బ్రిడ్జిలను అభివృద్ధి చేసేందుకు పరిపాలన పరమైన ఉత్తర్వులు వెలుపడ్డాయని ఆయన తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రహదారుల అభివృద్ధి పథకం( ఏ పీ ఆర్ ఆర్ ఎస్ పి) పథకం కింద ఈ పనులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వటం సంతోషించాల్సిన విషయం అని ఆయన తెలియజేశారు. ఈ పనుల్లో భాగంగా గజపతినగరం నియోజకవర్గంలో సుదీర్ఘకాలంగా ప్రజలు ఎదురుచూస్తున్న పనులకు పరిపాలన పరమైన అనుమతులు రావటం సంతోషించాల్సిన విషయమన్నారు.
ఇటీవల గజపతినగరం నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన జామి మండల పరిధిలోని శాసనపల్లి పెదవేమలి మధ్య సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న హై లెవెల్ వంతేన నిర్మాణ పనులకు, గజపతినగరం మండలం ఆండ్ర ఆర్ అండ్ బి రోడ్ నుంచి మర్రివలస మధ్య రహదారితోపాటు బ్రిడ్జి నిర్మాణపనులకు అనుమతులు రావడం పట్ల ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. విజయనగరం జిల్లా పరిధిలో ఇంతపెద్ద ఎత్తున రహదారులు, బ్రిడ్జి నిర్మాణ పనులకు అనుమతులు రావడం వెనక రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువనేత నేత నారా లోకేష్ చొరవ ఎంతో ఉందని, వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఈ ప్రకటనలో వివరించారు.
ఈ ప్రకటన రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కార్యాలయం, విజయనగరం నుండి జారీ చేయడమైనది