Close

విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొంటాం : కలెక్టర్ ఎస్ రాసుందర్ రెడ్డి పేర్కొన్నారు

Publish Date : 29/10/2025

 

విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొంటాం

ఆకస్మిక తనిఖీలలో నలుగురు అధికారులకు షోకాస్ నోటీసులు

విజయనగరం, అక్టోబర్ 28:  మొంథా తుఫాను నేపథ్యంలో ఎటువంటి విపత్తులైన సమర్థవంతంగా ఎదుర్కోటానికి జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉందని కలెక్టర్ ఎస్ రాసుందర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఎస్ పి ఏ ఆర్ దామోదర్ తో కలిసి పెద్ద చెరువు ట్యాంక్ బండ్ రోడ్లను పరిశీలించి మున్సిపల్ కమిషనర్ నల్లనయ్యకు తగు సూచనలు జారీ చేశారు.  ముఖ్యంగా కాలువలు స్టాగ్నేషన్ లేకుండా నీరు సజావుగా పారే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ జిల్లాలో 41 కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఎటువంటి నష్టం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.  లోతట్టు ప్రాంతాల ప్రజలను, పూరి గుడిసెలు, పాడైపోయిన భవనాలలో ఉన్న వారిని పురావస కేంద్రాలకు లేదా వారి అభీష్టం మేరకు బంధువుల ఇళ్లకు తరలించడం జరుగుతోందని వివరించారు.  అదేవిధంగా తుఫాను ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ముందుగానే బియ్యం పంపిణీ చేపట్టడం జరిగిందన్నారు. 227 మంది పది రోజులలో డెలివరీ కానున్న గర్భిణీ స్త్రీలను గుర్తించి, వారిని ముందుగానే ఆసుపత్రులకు తరలించడం జరిగిందని తెలిపారు.  అదేవిధంగా పశువులను రక్షించేందుకు వీలుగా పశు యజమానులు వాటిని బంధించకుండా ఉంచాలని సూచనలు జారీ చేయడం జరిగిందన్నారు.

అనంతరం బొండపల్లి చేరుకున్న కలెక్టర్ తాసిల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమును పరిశీలించారు. కంట్రోల్ రూమ్ లో విధుల కేటాయింపు, విధుల నిర్వర్తనపై అసహనం వ్యక్తం చేశారు. అదేవిధంగా గజపతినగరం తాసిల్దార్ కార్యాలయాన్ని కూడా ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్  అక్కడ కూడా కంట్రోల్ రూమ్ నిర్వహణపై అసంతృప్తి వ్యక్తపరిచారు.  కంట్రోల్ రూమ్ ఏర్పాట్లు, విధుల నిర్వర్తనకు బాధ్యత వహించవలసిన తాసిల్దార్లు, పర్యవేక్షణ చేయాల్సిన మండల ప్రత్యేక అధికారులు తుఫాన్ లాంటి విపత్కర పరిస్థితులలో వారి విధులలో నిర్లక్ష్యం ప్రదర్శించడం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసారు.  ఈ నేపథ్యంలో బొండపల్లి, గజపతినగరం మండల తాసిల్దార్లకు, ఆయా మండలాల ప్రత్యేక అధికారులు పట్టు పరిశ్రమ సహాయసంచాలకులు, జిల్లా కోపరేటివ్ అధికారి కి సోకజ్ నోటీసులు జారీ చేశారు.

=========

జారీ: డి ఐ పి ఆర్ ఒ, విజయనగరం

2910-A

2910-A

2910-B

2910-B

2910-C

2910-C

2910-D

2910-D

2910-E

2910-E