Close

శ్రీవాణి ట్రస్ట్ నిధులతో భజన మందిరాల నిర్మాణం: విజయనగరం జిల్లాలో దరఖాస్తులకు ఆహ్వానం

Publish Date : 25/11/2025

తేదీ: 24 నవంబర్ 2025
స్థలం: విజయనగరం
​శ్రీవాణి ట్రస్ట్ నిధులతో భజన మందిరాల నిర్మాణం: విజయనగరం జిల్లాలో దరఖాస్తులకు ఆహ్వానం
​విజయనగరం జిల్లాలోని మారుమూల గ్రామాలు, పరిసర ప్రాంతాలు, మరియు ప్రత్యేకించి గిరిజన, ఎస్సీ, ఎస్టీ, బిసి కాలనీలలో భజన మందిరాల ఏర్పాటుకు, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వారి శ్రీవాణి ట్రస్ట్ నిధుల నుండి మంజూరు కొరకు అర్హులైన వారి నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు దేవాదాయ ధర్మదాయ శాఖ సహాయ కమిషనరు శ్రీమతి కె. శిరీష గారు తెలిపారు.
​ముఖ్య అంశాలు మరియు మార్గదర్శకాలు
​నిధుల కేటాయింపు: నిర్మాణ స్థల లభ్యత మరియు పరిస్థితుల ఆధారంగా మందిరాలను మూడు రకాలుగా (టైపు-ఏ, టైపు-బి, టైపు-సి) విభజించి, రూ. 10 లక్షల నుండి రూ. 20 లక్షల వరకు నిధులు మంజూరు చేయబడతాయి.
​నిర్మాణ ప్రమాణాలు: నిర్మాణము దేవాదాయ శాఖ మంజూరు చేసిన నమూనా మరియు మార్గదర్శకాల ప్రకారము చేపట్టవలెను.
​అర్హతా నిబంధన: దరఖాస్తు చేసుకున్న ప్రాంతంలో (కాలనీ/గ్రామం) ఇప్పటికే ఏ విధమైన దేవాలయము ఉండి యుండరాదు.
​దరఖాస్తు విధానం
​దరఖాస్తుదారులు స్థల లభ్యత, విస్తీర్ణం వివరాలతో పాటు, స్థల యజమాని నుండి పొందిన నిరభ్యంతర పత్రం (No Objection Certificate) తప్పనిసరిగా జతచేయాలి.
​దరఖాస్తులు సమర్పించవలసిన చిరునామా:
సహాయ కమిషనరు,
దేవదాయ శాఖ వారి కార్యాలయము,
తోటపాలెం, విజయనగరం.
​సమగ్ర వివరాల కోసం ఆసక్తిగలవారు కార్యాలయ పనివేళల్లో సంప్రదించవచ్చు.
​జారీ చేసినవారు:
కె. శిరీష
సహాయ కమీషనరు
దేవదాయ ధర్మదాయశాఖ
విజయనగరం.