సఫాయి కర్మచారి యువతకు ఋణావకాశం
Publish Date : 11/11/2025
ఫాయి కర్మచారి యువతకు ఋణావకాశం
విజయనగరం జిల్లాలోని సఫాయి కర్మచారి వృత్తిలో వున్న నిరుద్యోగ యువతకు NSKFDC పదకములో సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ (Desludging Vehicles) వాహనములను సబ్సిడీ పై మంజూరు చేయుటకు దరఖాస్తులను కోరడమైనది.
NSKFDC పదకములోది.29-11-2023 న, వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులముల సహకార ఆర్ధిక సంస్థ, తాడేపల్లి, అమరావతి వారు విజయనగరం జిల్లాకు మంజూరు చేసిన 3000 లీటర్ల సామర్ధ్యం గల సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ (Desludging Vehicles) వాహనముల లబ్దిదారులలో ఋణమును చెల్లించుటలో విఫలమైన లబ్దిదారులకు చెందిన మూడు (3) సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ (Desludging Vehicles) వాహనములు షరతుల మేరకు తిరిగి మంజూరు చేయుటకు ఆశక్తి గల, అనుభవం మరియు ఈ క్రింది అర్హతలు గల అభ్యర్దులు నేరుగా, కార్యనిర్వాహక సంచాలకులు, జిల్లా షెడ్యూల్డు కులముల సేవా సహకార సంస్థ, డా.మర్రిచెన్నారెడ్డి భవనం, కంటోన్మెంట్, విజయనగరం నందు స్వయంగా గాని లేదా పోస్ట్ ద్వారా గాని ధరఖాస్తు చేసుకొనుటకు కోరడమైనది.
అర్హతలు:
- ఆశక్తి గల అభ్యర్దులు 5 గురు కలిసి ఒక గ్రూపుగా ఏర్పడవలెను.
- 5 గురు గ్రూపు సభ్యులు సఫాయి కర్మచారి సర్టిఫికేట్ లు తప్పని సరిగా కలిగి ఉండవలెను
- 5 గురు గ్రూపు సభ్యులలో ఒకరికి హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండవలెను.
- సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ (Desludging Vehicles) పధకము విలువలో సబ్సిడీ పోను మిగిలిన ఋణమును 6 శాతము వడ్డీతో 72 నెలసరి వాయిదాలలో, ఒక్కొక్క వాయిదా నెలకు రూ.33,064/- చొప్పున క్రమం తప్పకుండా ఈ కార్యాలయమునకు కట్టవలెను.
మరిన్ని పూర్తి వివరములకు ఈ మొబైల్ నెం.ను సంప్రదించగలరు: 9030014742 / 9642460838 / 9652600967
కార్యనిర్వాహక సంచాలకులు,
జిల్లా షెడ్యూల్డు కులముల సేవా సహకార సంస్థ,
విజయనగరం