Close

80 per cent land acquisition to be completed by the end of this year, Raipur Visakhapatnam National Highway

Publish Date : 08/10/2021

పత్రికా ప్రకటన-4

ఈ నెలాఖరుకల్లా  80 శాతం భూ సేకరణ పూర్తి చేయాలి

రాయిపూర్ విశాఖపట్నం  జాతీయ  రహదారి పనుల పై సమీక్షించిన కలెక్టర్

విజయనగరం, అక్టోబర్ 06 :   రాయిపూర్ విశాఖపట్నం  జాతీయ  రహదారి భూ సేకరణకు సంబంధించి  ఈ నెల 20 నాటికి  కనీసం 50 హెక్టార్ల కు   3 జి అవార్డు పూర్తి చేసి 70 కోట్ల భూ పరిహారాన్ని  లబ్దిదారులకు అందించాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి ఆదేశించారు.  బుధవారం ఆమె ఛాంబర్ లో భూ సేకరణపై సంబంధిత  అధికారులతో సమీక్షించారు.   రాయిపూర్ విశాఖపట్నం  జాతీయ  రహదారికి సంబంధించి   పేకేజీ 1 క్రింద ఆలూరు నుండి జక్కువ  వరకు 31.77 కి.మీ. లు,  పేకేజీ 2 క్రింద జక్కువ నుండి కొర్లం వరకు 24.30 కి .మీ లు , పేకేజీ 3 క్రింద కొర్లం నుండి కంటకాపల్లి  వరకు 24 కి.మీ. లు,  పేకేజీ 4 క్రింద కంటకాపల్లి నుండి సబ్బవరం వరకు 19.56 కి.మీ ల రహదారికి గాను   అవసరమైన భూ సేకరణ నెలాఖరుకి 80 శాతం పూర్తి అయ్యేలా చూడాలన్నారు.  ఇప్పటికే మంజూరైన 70 కోట్ల రూపాయలను పరిహారంగా చెల్లించి పనులు వేగంగా జరిగాలని అన్నారు.  సంబంధిత తాసీల్దార్లు  ఈ పనులపై ప్రత్యెక దృష్టి  పెట్టాలన్నారు.

    ఈ సమావేశం లో సంయుక్త కలెక్టర్  డా. జి.సి.కిషోర్ కుమార్, ఆర్.డి.ఓ బి.హెచ్.ఎస్. భవాని శంకర్, జాతీయ రహదారుల, రైల్వే  శాఖల అధికారులు, తాసీల్దార్లు  పాల్గొన్నారు.

———————————————————————————————————-

జారి; సహాయ సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ, విజయనగరం.

రాయిపూర్ విశాఖపట్నం జాతీయ రహదారి పనుల పై సమీక్షించిన కలెక్టర్