ఒన్ స్టాప్ వెహికల్ హెల్ప్ లైను వాహనంను ప్రారంభం, జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలక్టరు, వాహనం ద్వారా ఒన్ స్టాప్ సెంటరుపై విస్తృత అవగహన కార్యక్రమాలు, హింసకు గురైన మహిళలకు తక్షణ సహాయం అందించడం, మహిళ హెల్ప్ లైను 181 టోల్ ఫ్రీ నెంబరు ద్వారా సేవలు పొందవచ్
Publish Date : 10/12/2025
ఒన్ స్టాప్ వెహికల్ హెల్ప్ లైను వాహనంను ప్రారంభం
జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలక్టరు
వాహనం ద్వారా ఒన్ స్టాప్ సెంటరుపై విస్తృత అవగహన కార్యక్రమాలు
హింసకు గురైన మహిళలకు తక్షణ సహాయం అందించడం
మహిళ హెల్ప్ లైను 181 టోల్ ఫ్రీ నెంబరు ద్వారా సేవలు పొందవచ్చు
– జిల్లా కలక్టరు ఎస్ రాంసుందర్ రెడ్డి
విజయనగరం, డిశంబరు, 09: మహిళల అత్యవసర సేవల కోసం వన్ స్టాప్ వెహికల్ హెల్ప్ లైను వాహనంను మంగళవారం కలక్టరేటు ప్రాంగణంలో జిల్లా కలక్టరు ఎస్ రాంసుందర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. వన్ స్టాప్ సెంటర్ (One Stop Centre – OSC) వాహనాల ప్రధాన ఉద్దేశ్యం హింసకు గురైన మహిళలకు తక్షణ సహాయం అందించడం, ఇందులో వైద్యం, న్యాయం, పోలీస్ సహాయం, కౌన్సెలింగ్, మరియు తాత్కాలిక ఆశ్రయం వంటి సేవలను ఒకే చోట (ఒకే పైకప్పు కింద) సమగ్రంగా అందుబాటులో ఉంచడం, దీని ద్వారా వారు సురక్షితంగా, గౌరవంగా తమ సమస్యల నుండి బయటపడటానికి సహాయపడటం. ఈ సేవలను అందించే వాహనం, మహిళలను హింస జరిగే ప్రదేశం నుండి (ఇల్లు, పని స్థలం, సమాజం) ఈ కేంద్రాలకు తీసుకురావడానికి లేదా వారికి అవసరమైన ప్రదేశాలకు తరలించడానికి ఉపయోగపడుతుంది. ఆపదలో ఉన్న మహిళా హెల్ప్ లైను వాహనం వన్ స్టాప్ సెంటరుగా మహిళలకు ఉపయోగపడుతుంది. మహిళ హెల్ప్ లైను 181 టోల్ ఫ్రీ నెంబరుకు పోలీసు (100), ఆసుపత్రి (108), లీగల్ సర్వీసెస్ మొదలగు నవి అనుసంధానం చేయబడి వున్నందున 24/7 మహిళల కోసం 181 టోల్ ఫ్రీ నెంబరుకు ద్వారా మహిళలు అత్యవసర సేవలు మహిళలకు వైద్య సహాయం, పోలీసు సహాయం, చట్ట సహాయం, కౌన్సిలింగు, తాత్కాలిక ఆశ్రయం పొందవచ్చును.
జిల్లాలో ఒన్ స్టాప్ సెంటరు కేసులు: మే 2016 నుండి నవంబరు 2025 వరకు జిల్లాలో మొత్తం 2132 కేసులు నమోదు కాగా, 2103 కేసులకు కౌన్సిలింగు అందించారు.
జిల్లాలో ఒన్ స్టాప్ సెంటరుపై అవగాహన కార్యక్రమాలు: జిల్లాలో వన్ స్టాప్ సెంటరు 06, జూలై, 2017 లో ప్రారంభించుట జరిగినది. లైంగిక వేధింపులు, గృహ హింస నుండి రక్షణ, చట్ట సహాయం, పోలీసు సహాయం, వైద్య సేవలు, 24/7 ఉచిత తాత్కలిక ఆశ్రయం సేవలు నిర్వహించుటకు ఒన్ స్టాప్ సెంటరులో 13 మంది సిబ్బంది పనిచేయుచున్నారు. ఒన్ స్టాప్ సెంటరు పరిధిలో గృహ హింస, శారీరక హింస, లైంగిక దాడులు/రేప్ /PSCSO కేసులు, మానసిక భావోద్వేగ హింస, ఆర్ధిక హింస, వరకట్నం వేధింపులు, సైబర్ వేధింపులు, పని ప్రదేశేంలో లైగింక వేధింపులు, మహిళలు / పిల్లలు అక్రమ రవణా, బాల్య వివాహలు, మహిళల భద్రత, గౌరవం, ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ఇతర కేసులు మొదలగునవి వస్తాయి. మహిళల కోసం ఏర్పాటు చేసిన ఒన్ స్టాప్ సెంటరు ద్వారా జిల్లాలో జూలై 2017 నుండి నవంబరు 2025 వరకు 1810 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, పాఠశాలలు, కళశాలలు, ఉపాధి హామి పధకం కార్మికులు, కోచింగు సెంటర్లులలో అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమం లో ఐసిడిఎస్ పీడీ విమల రాణి, డి ఎం సి సుజాత గారు, సీడీపీఓస్, వన్ స్టాప్ సెంటర్, అడ్మినిస్ట్రేటర్ మరియు సిబ్బంది, డీసీపి యూనిట్ సిబ్బంది, గృహహింస సిబ్బంది, pd ఆఫీస్ సిబ్బంది, చైల్డ్ లైన్ సిబ్బంది, తదితరులు పెద్ద ఎత్తున పాల్గోన్నారు.
—————————————————————————————-
జారీ: జిల్లా సమాచార పౌరసంబంధాల అధికారి, విజయనగరం

1012-A