గురుదేవ ఛారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయం* జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి
Publish Date : 08/12/2025
గురుదేవ ఛారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయం*
జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి
కొత్తవలస, (విజయనగరం), డిసెంబరు 06 ః
శ్రీ గురుదేవ ఛారిటబుల్ ట్రస్టు సేవలు అభినందనీయమని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అన్నారు. మండలంలోని మంగళంపాలెంలో ఉన్న ట్రస్టు కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ శనివారం సందర్శించారు. ట్రస్టు అందిస్తున్న వైద్య సేవలు, సేవా కార్యక్రమాలు, ఇతర కార్యకలాపాలను పరిశీలించారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను కలెక్టర్ చేతులమీదుగా పంపిణీ చేశారు.
ట్రస్టు వ్యవస్థాపకులు ఆర్. జగదీష్‌బాబు ముందుగా మాట్లాడుతూ, ట్రస్టు కార్యకలాపాలను, స్థాపనకు దారితీసిన పరిస్థితులను వివరించారు. ఇప్పటివరకు సుమారు 2లక్షలా, 40 వేలమందికి కృత్రిమ కాళ్లు, చేతులను అందజేయడం జరిగిందని చెప్పారు. దివ్యాంగులకు, పేదలకు అందిస్తున్న సేవా కార్యక్రమాలను ఆయన వివరించారు. ఈ పర్యటనలో ఇన్‌ఛార్జి తాహసీల్దార్ పి.సునీత, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
………………………… ………………………… ………………………… ……………………
జారీ ః జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖాధికారి, విజయనగరం.

081225-A

081225-B

081225-C