Close

గుర్ల కేజీబివి విద్యార్ధులు క్షేమంగా ఉన్నారని జిల్లా కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి తెలిపారు.

Publish Date : 29/10/2025

విజయనగరం, అక్టోబర్ 28 :
       గుర్ల కేజీబివి విద్యార్ధులు క్షేమంగా ఉన్నారని జిల్లా కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి తెలిపారు. కేజీబీవీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా డార్మెటరీలో పరుపులు అంటుకొని వచ్చిన పొగతో ఐదుగురు విద్యార్థులు స్వల్ప అస్వస్థతకు గురి అయ్యారని తెలిపారు.
 వెంటనే వారిని నెల్లిమర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా, విద్యార్థుల ఆరోగ్యం ప్రస్తుతం మెరుగుపడిందని వైద్యులు తెలిపినట్లు
కలెక్టర్ ప్రకటించారు.
      ఈ సంఘటనపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆరా తీశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అలాగే విద్యుత్ సురక్షిత చర్యల పర్యవేక్షణకు ఎపిఇపిడిసిఎల్ ఎస్.ఇ. కి ఆదేశాలు ఇచ్చారు.
……….
జారీ: జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి, విజయనగరం.
2910-B

2910-B

2910-A

2910-A2910-A