జాతీయ న్యాయ సేవ అధికార సంస్థ న్యూఢిల్లీ మరియు ఆంధ్రప్రదేశ్రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల మేరకు ప్రపంచ మానవ హక్కులదినోత్సవం
Publish Date : 12/12/2025
జాతీయ న్యాయ సేవ అధికార సంస్థ న్యూఢిల్లీ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల మేరకు ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఈరోజు జిల్లా కోర్టు ఆవరణలో న్యాయ సహాయ శిబిరాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ అధ్యక్షులు ఎం బబిత ప్రారంభోత్సవం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1948 డిసెంబర్ 10న ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సార్వత్రిక హక్కుల ప్రకటనను ఆమోదించిన జ్ఞాపకార్థము ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు.
మానవ హక్కులు ప్రతి వ్యక్తికి జన్మనిచ్చిన ప్రాథమిక హక్కులు అని, కులం-మతం – జాతి -లింగం- వైవిధ్యాలకు అతీతంగా ప్రతి మనిషి గౌరవంతో జీవించే హక్కు కలిగి ఉన్నాడని పేర్కొన్నారు. హింస వివక్ష బలహీనవర్గాలపై జరుగుతున్న హక్కుల ఉల్లంఘనలను అరికట్టడంలో విద్యార్థులు, పౌర సమాజం,ప్రభుత్వ యంత్రాంగం, సమిష్టిగా కృషి చేయాల్సి ఉందని వారు అన్నారు.ఇందుకు సంబంధించి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సహాయం చేస్తుందని, పౌర హక్కులను కాపాడటంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ముందుంటుందని తెలియజేశారు,అందుకు ఈ న్యాయ సహాయ శిబిరం ఉపయోగపడుతుందని కక్షిదారుల సందేహాలను సమస్యలను పరిష్కరించడానికి ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశామని తెలియజేశారు.ఈ సందర్భంగా మానవ హక్కుల చరిత్ర, రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులు బాలల మహిళల దివ్యాంగుల హక్కులు న్యాయ సహాయం లభ్యత వంటి అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు ప్రతి ఒక్కరూ తమ హక్కులను తెలుసుకోవడంతో పాటు ఇతరుల హక్కులను గౌరవించే బాధ్యత మనందరిపై ఉందని ఈ కార్యక్రమంలో వెల్లడించారు.
అనంతరం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ నిర్వహిస్తున్న విధులను జాతీయ లోక్ అదాలకు సంబంధించిన సందేశాన్ని ప్రజలకు ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు చేరు అవ్వాలని ఉద్దేశంతో సంచార వాహనాన్ని ప్రారంభించి నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఇతర న్యాయమూర్తులు బార్ మెంబర్స్ కక్షిదారులు పాల్గొన్నారు.
జారీ చేయువారు
జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ విజయనగరం

121225-A