Close

జిల్లాలో అమలు జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై కలెక్టర్ తో చర్చించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్

Publish Date : 26/12/2025

జిల్లాలో అమలు జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై కలెక్టర్ తో చర్చించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్.
 త్వరితగతిన పరిశ్రమలు ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి.
 నైపుణ్య శిక్షణ అందించి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.
విజయనగరం: 24 డిసెంబర్ 2025: విజయనగరం జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల పురోగతి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ కలిసి చర్చించారు. పెండింగ్ అంశాలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం విజయనగరం జిల్లాకు పారిశ్రామికంగా పెద్దపీట వేస్తున్న నేపథ్యంలో,  కొత్తగా వచ్చే పరిశ్రమలకు అవసరమైన మౌళిక  వసతుల కల్పన, త్వరిత గతిన పరిశ్రమల ఏర్పాటు కోసం సత్వర చర్యలు తీసుకోవాలని, పరిశ్రమల్లో వచ్చే ఉద్యోగాలకు అనుగుణంగా నిరుద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా నైపుణ్య శిక్షణ అందించి, ఎక్కువ ఉద్యోగాలు స్థానికులకు దక్కేలా చర్యలు చేపట్టాలని సూచించారు.   ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి,  సంక్షేమ కార్యక్రమాలు పారదర్శకంగా అమలయ్యే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు.ఇందుకు సంబంధించి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు వేగవంతం చేసేందుకు పలు సూచనలు చేశారు. ఉపాధి హామీ పథకం కింద పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు వీలైనంత త్వరగా బిల్లును చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని, ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి త్వరిత కట్టిన బిల్లు చెల్లించే విధంగా పనిచేయాలని అన్నారు. ఇదేవిధంగా సామాన్య ప్రజల నుంచి మంత్రికి వచ్చిన విజ్ఞప్తులను అధికారులు సత్వర పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు.
261225-B

261225-B