జిల్లా వ్యాప్తంగా జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవర్యాలీలు నిర్వహణ, ప్రజల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి- జిల్లాకలక్టరు జిల్లా కలక్టరు ఎస్ రాంసుందర్ రెడ్డి
Publish Date : 11/11/2025
జిల్లా వ్యాప్తంగా జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవ ర్యాలీలు నిర్వహణ
ప్రజల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
– జిల్లా కలక్టరు జిల్లా కలక్టరు ఎస్ రాంసుందర్ రెడ్డి
విజయనగరం, నవంబరు, 07: జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా ప్రతి మండల స్థాయిలో మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయిలో గ్రామస్థాయిలో జిల్లా వ్యాప్తంగా గురువారం నాడు ప్రజలను అవగాహన కల్పించుటకు ర్యాలీలు మీటింగులు పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగినదని జిల్లా కలక్టరు జిల్లా కలక్టరు ఎస్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. ప్రజల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించదన్నారు. ప్రభుత్వం అత్యంత ప్రాముఖ్యంగా ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టి అందులోను క్యాన్సర్ల మీద ముందస్తుగా తనిఖీలు చేయటం ప్రారంభించినదన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ, ఏఎన్ఎం, సిహెచ్ఓ, ఇంటింటికి వెళ్లి ప్రజలను క్యాన్సర్స్పై అవగాహన కల్పించి వారిని తనిఖీలు చేసి ఒకవేళ ప్రాథమిక లక్షణాలు ఉన్నచో జిల్లా స్థాయిలో ఉన్న ఆసుపత్రికి ఉచితముగా పంపటం మరియు చికిత్స అందించటం జరుగుతుందన్నారు. . గత సంవత్సరం ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఉన్న 18 సంవత్సరాలు పైబడిన 15 లక్షల మందికి స్క్రీనింగ్ చేయడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం కూడా సమగ్ర క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమంలో భాగంగా గత నెల రోజులుగా ఇంటింటికి తిరిగి అవగాహన చేయుట మరియు ప్రాథమిక లక్షణాలను గుర్తించుట జరుగుతోందన్నారు.. ప్రధానంగా నోటి క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సరు, గర్భాశయం యొక్క ద్వార క్యాన్సరు మీద అవగాహన కల్పించి ప్రాథమికంగా గుర్తించుట ముందస్తుగా నివారించుట జరుగుతుందని జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా జిల్లా కలక్టరు జిల్లా కలక్టరు ఎస్ రాంసుందర్ రెడ్డి కోరారు.
————————————————————————————–
జారీ: జిల్లా సమాచార పౌరసంబంధాల అధికారి, విజయనగరం

111125-A

111125-B