పరిశ్రమలకు త్వరగా అనుమతులు జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి 6 కొత్త యూనిట్ల ప్రగతిపై డిఐఈపిసిలో సమీక్ష
Publish Date : 08/12/2025
పరిశ్రమలకు త్వరగా అనుమతులు
జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి
6 కొత్త యూనిట్ల ప్రగతిపై డిఐఈపిసిలో సమీక్ష
విజయనగరం, డిసెంబరు 06 ఃజిల్లాలో పరిశ్రమల స్థాపనకు వచ్చే ధరఖాస్తులకు వీలైనంత వేగంగా అనుమతులు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. గడువు పూర్తయ్యేవరకు వేచి చూడకుండా, వచ్చిన ధరఖాస్తులను వెంటనే పరిశీలించి, అనుమతించాలని సూచించారు. అలాగే ఏ శాఖవద్ద ధరఖాస్తు పెండింగ్ ఉన్నా, ఆ శాఖతో మాట్లాడి అనుమతి మంజూరు చేసేవిధంగా చూడాలని పరిశ్రమల శాఖను ఆదేశించారు.
జిల్లా పరిశ్రమలు మరియు ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డిఐఈపిసి) సమావేశం కలెక్టరేట్‌లో శనివారం జరిగింది. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, సింగిల్ డెస్క్ విధానం, ఇన్సెంటివ్ మంజూరు, పిఎంఈజిపి కార్యక్రమం, ఏపిఐఐసికి సంబంధించిన అంశాలు, కొత్త యూనిట్ల ఏర్పాటు, ర్యాంపు తదితర కార్యక్రమాలపై సమీక్షించారు. జిల్లాలో కొత్తగా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే వారికి జిల్లా యంత్రాంగం తరపున అన్నివిధాలా సంపూర్ణ సహకారం అందించి, వీలైనంత వేగంగా స్థాపించే విధంగా కృషి చేయాలని ఆదేశించారు. కొత్తగా ఏర్పాటు కానున్న 6 పరిశ్రమల గురించి సమీక్షిస్తూ, వాటికి అవసరమైన సహకారాన్ని అందించాలని ఆయా శాఖలకు సూచించారు. శారదా మెటల్స్ అండ్ అల్లాయిస్ విస్తరణ, కొత్తవలస ఇన్‌ఫ్రా ఇండస్ట్రియల్ పార్క్, సోలిడ్ ఆర్గానిక్ ఆగ్రోఫరమ్, సూపర్ స్మెల్టర్స్ లిమిటెడ్, సత్య బయోఫ్యూయల్, మా మహామాయ ఇండస్ట్రీస్ మొదలగు వాటిలో కొన్ని విస్తరణకు ప్రతిపాదించగా మరికొన్ని కొత్తగా ఏర్పాటు కానున్నాయి. వీటి ప్రగతిపై కలెక్టర్ సమీక్షించారు. అలాగే ర్యాంపు కార్యక్రమంలో భాగంగా యువతకు చైతన్యం కల్గించి, పరిశ్రలమ స్థాపనకు ముందుకు వచ్చేవిధంగా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.
ఈ సమావేశంలో పరిశ్రమలశాఖ డిడి ఎంవి కరుణాకర్, ఏపిఐఐసి జెడ్ఎం మురళీమోహన్, పొల్ల్యూషన్ ఇంజనీర్ సరిత, అగ్నిమాపక అధికారి రాంప్రకాష్, నాబార్డ్ డిడిఎం నాగార్జున, ఏపిఈపిడిసిఎల్ ఎస్ఈ ఎం.లక్ష్మణరావు, మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య, ఇతర శాఖల అధికారులు, వివిధ పరిశ్రమల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

061225-A

061225-B
……………………………………………………………………………………………………