Close

పీజిఆర్ఎస్లో కలెక్టర్ మానవత్వం

Publish Date : 06/04/2026

విజయనగరం, ఏప్రిల్ 06: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజిఆర్ఎస్ కార్యక్రమంలో ఒక అభ్యర్థి సమస్యపై జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి స్పందించిన విధానం అందరి దృష్టిని ఆకర్షించింది.

కొత్తవలస మండలం ఉత్తరాపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగుడైన సబ్బవరపు పోతురాజు తన సమస్యను తెలియజేయడానికి కలెక్టరేట్‌కు వచ్చారు. పోర్టికో వద్ద ఆయనను గమనించిన కలెక్టర్ నేరుగా ఆయన వద్దకు వెల్లి దరఖాస్తును స్వీకరించారు.

పోతురాజు తన సమస్యను వివరించగా, కలెక్టర్ సంబంధిత అధికారులతో మాట్లాడి, సమస్యను త్వరితగతిన పరిశీలించి పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు. వారికి వీల్ చైర్ ఏర్పాటు చేయించి పిజిఆర్ఎస్ వేదిక వద్దకు పంపించారు.

ప్రజల నుండి అందిన వినతులను స్వీకరించి,  ప్రజా సమస్యల పరిష్కారానికి జిల్లా పరిపాలన యంత్రాంగం కట్టుబడి ఉండాలని ఈ సందర్భంగా కలెక్టర్ స్పష్టం చేసారు.

===========

జారీ : జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, విజయనగరం

06042026

06042026