పురిటి నొప్పులతో సహాయక చర్యల కోసం ఎదురు చూసిన గర్భిణి 👉 జిల్లా కలెక్టర్ ఆదేశాల ముద్రకు వైద్య సిబ్బంది చొరవ తో సుఖ ప్రసవం.. 👉 వైద్య సిబ్బందిని అభినందించిన జిల్లా కలెక్టర్ రాం సుందర్ రెడ్డి I
Publish Date : 29/10/2025
పురిటి నొప్పులతో సహాయక చర్యల కోసం ఎదురు చూసిన గర్భిణి
జిల్లా కలెక్టర్ ఆదేశాల ముద్రకు వైద్య సిబ్బంది చొరవ తో సుఖ ప్రసవం..
వైద్య సిబ్బందిని అభినందించిన జిల్లా కలెక్టర్ రాం సుందర్ రెడ్డి
విజయనగరం, అక్టోబరు 28: నిండు గర్భిణీ ..పురిటి నొప్పులతో బాధపడుతుంటే…సహాయం కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు…నదిని దాటే సాహసం చేయలేక .. రవాణా సౌకర్యం లేక..ఆందోళన చెందుతున్న కుటుంబ సభ్యులు… అంతలోనే ఏ.ఎన్.ఎం., ఆశ కార్యకర్త సురక్షితంగా గజపతినగరం ఆసుపత్రికి అంబులెన్స్ లో చేర్చగా ఆపరేషన్ చేసి డెలివరీ చేశారు. ఆ తల్లి పండంటి మగబిడ్డకు జన్మనివ్వడం తో కుటుంబ సభ్యులంతా ఊపిరి పీల్చుకున్నారు.
వివరాల్లోకి వెళితే
మెంటాడ మండలం లక్ష్మిపురం గ్రామానికి చెందింది గర్భిణీ మీసాల పార్వతి కి వైద్యులు నవంబర్ 20 వ తేదీని డెలివరీ తేదీ గా ఇచ్చారు. అయితే ఆమె కు మంగళవారం నొప్పులు ప్రారంభమైనయి. ఆసుపత్రికి తరలించేదుకు గ్రామస్థులు ఇబ్బందులు పడ్డారు. చంపావతి నదికి వరద ఉదృతి తాకిడి ఎక్కువుగా ఉండటంతో నదిని దాటి వెళ్ళే సాహసం చేయలేదు. గ్రామానికి 108 వాహనం వెళ్లే పరిస్థితి లేదు.
సహాయక చర్యలు కోసం ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులకు వైద్య సిబ్బంది అండగా నిలిచారు. ఆండ్ర వరకు గ్రామస్తుల సహకారం తో తీసుకు రాగా. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అక్కడి నుండి 108 వాహనం లో వైద్య సిబ్బంది గజపతినగరం ఏరియా ఆసుపత్రిలో చేర్చి సిజేరియన్ చేశారు. పార్వతి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
సిబ్బందిని అభినందించిన జిల్లా కలెక్టర్:::
తుఫాన్ హెచ్చరికలు అందిన రోజు నుండీ డెలివరీ కి 10 రోజుల సమయం ఉన్న వారందరినీ గుర్తించి సమీప ఆసుపత్రుల్లో చేర్చాలని ఆదేశాలు ఇస్తూనే ఉన్నారు. అయితే పార్వతి కి ఇంకా 20 రోజులు సమయం ఉన్నందున తరలించలేదని ఐసిడిఎస్, వైద్య అధికారులు తెలిపారు. ప్రీ టర్మ్ వచ్చే అవకాశం ఉన్నందున గర్భిణీలను సురక్షితంగా, వైద్య సేవలు అందే విధంగా ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. పార్వతి విషయం లో సరైన సమయంలో సరైన విధంగా స్పందించి సుఖంతం చేసినందుకు కలెక్టర్ అధికారులను అభినందించారు.
జిల్లాలో 10 రోజుల్లో డెలివరీ తేదీ ఉన్న వారిని 302 మందిని గుర్తించడం జరిగిందని, వీరందరినీ వెంటనే ఆసుపత్రులకు తరలించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
…………………………………………………………………………………………………….
జారీ ః జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖాధికారి, విజయనగరం.

2910-A

2910-B