పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం *బొండపల్లి మండలం గ్రామంలో జరిగిన గృహప్రవేశాలలో పాల్గొన్న మంత్రి కొండపల్లి
Publish Date : 13/11/2025
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
*బొండపల్లి మండలం గ్రామంలో జరిగిన గృహప్రవేశాలలో పాల్గొన్న మంత్రి కొండపల్లి
విజయనగరం, నవంబర్ 12: : పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమల, సెర్ప్ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు . పేదల అభివృద్ధికి ప్రభుత్వం అంకిత భావంతో, చిత్తశుద్ధితో పనిచేస్తూ ప్రతి సమస్య పట్ల స్పందిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం జరిగిన మూడు లక్షల గృహప్రవేశాలలో భాగంగా విజయనగరం జిల్లాలో 8793 గృహాలకు గృహప్రవేశాలు నియోజకవర్గం వారీగా జరిగాయి. ఇందులో భాగంగా గజపతినగరం నియోజకవర్గం బొందపల్లి మండలం అంబటివలస గ్రామంలో గృహప్రవేశ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో ఒకే రోజున 8793 మంది నూతన గృహాలలో అడుగు పెట్టడం ఆనందదాయకం అన్నారు. ఇందులో 4052 ఇళ్లకు 8 కోట్ల 11 లక్షలు రూపాయలను ప్రభుత్వం అదనపు సహాయాన్ని అందించడం జరిగిందన్నారు. పేదలకు ఇళ్ళు కల్పించాలని మొట్టమొదటి స్వర్గీయ ఎన్.టి.ఆర్ గారే తలపెట్టారని, ఆ తర్వాత ప్రధాని మోడీ దేశమంతటా అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.
మరో రెండు రోజుల్లో విశాఖ వేదికగా సీఐఐ సదస్సులు జరుగుతాయని, రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు వచ్చేలా ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని, దీని వలన అనేక మందికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. విద్యాభివృద్ధికి, ఉపాధి కల్పనకు సీఎం, పి.ఎం లు కష్టపడుతున్నారని, ఒక ఎం.ఎల్.ఏ గా తానూ వారి అడుగుజాడల్లో నడుస్తానని అన్నారు.
జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ స్వంత ఇల్లు ప్రతి ఒక్కరి కల యని, నెరవేరడం అదృష్టమని అన్నారు. ఇల్లు లేని వారు దరఖాస్తు చేసుకోవాలని, అందరికీ ఇల్లు మంజూరు చేస్తామని తెలిపారు. ప్రభుత్వం ఇఛ్చిన స్థలం లో ప్రతి ఒక్కరూ ఇల్లు కట్టుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఇంటి తాళాలు, నూతన వస్త్రాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, ఏ.ఎం.సి వైస్ చైర్మన్ కోరాడ రామకృష్ణ,జన సేన ప్రతినిధి మఱపు సురేష్, హౌసింగ్ పిడి మురళి మోహన్, తహసీల్దార్, ఎం.పి.డిఓ , ఇతర మండల అధికారులు పాల్గొన్నారు.
——————————————————-
జారీ: జిల్లా సమాచార మరియు పౌర సంబంధాల అధికారి, విజయనగరం.

131125-C

1311-D

131125-A

131125-B