ప్రతినెల నిర్వహించే పౌర హక్కుల దినం కు సభ్యులందరినీ ఆహ్వానించాలి• ఎస్.సి.,ఎస్.టి అట్రాసిటి జరిగినప్రాంతానికి ఆర్.డి.ఓ, డి.ఎస్.పి లు హాజరు కావాలిజిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి
Publish Date : 24/12/2025
ప్రతి నెల నిర్వహించే పౌర హక్కుల దినం కు సభ్యులందరినీ ఆహ్వానించాలి
- ఎస్.సి., ఎస్.టి అట్రాసిటి జరిగిన ప్రాంతానికి ఆర్.డి.ఓ, డి.ఎస్.పి లు హాజరు కావాలి
జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి
విజయనగరం, డిసెంబర్ 23: ప్రతి నెల 30 వ తేదీన నిర్వహించే పౌర హక్కుల దినం కు డివిఎంసి సభ్యులందరినీ ఆహ్వానించాలని, నెల రోజుల ముందే సివిల్ రైట్స్ డే నిర్వహించే గ్రామం, సమయం వివరాలను షెడ్యూల్ చేయాలనీ జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. సమావేశం నిర్వహించిన అనంతరం సమేవేశపు మినిట్స్ ను జిల్లా కలెక్టర్ కు పంపాలని, అక్కడి సమావేశం లోని అంశాల పై జిల్లా స్థాయి విజిలెన్సు అండ్ మోనిటరింగ్ కమిటీ సమావేశం లో చర్చించడం జరుగుతుందని తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియం లో జిల్లా స్థాయి విజిలేన్సు అండ్ మోనిటరింగ్ కమిటీ , మాన్యువల్ స్కావెంజర్ నిరోధక మరియు పునరావాస చట్టం పై సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నెల 30 న అన్ని మండలాల్లో ఎస్.హెచ్.ఓ., తహసిల్దార్ ఆధ్వర్యం లో సివిల్ రైట్స్ డే జరపాలని, ఆ మీటింగ్ మినిట్స్ ను పంపాలని సూచించారు.
డి.వి.ఎం.సి సభ్యులు బసవ సూర్యనారాయణ మాట్లాడుతూ ఎస్.సి. కాలనీలలో కొన్ని చోట్ల స్మశానాలు లేవని, మరి కొన్ని చోట్ల ఆక్రమించ బడ్డాయని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. కలెక్టర్ స్పందిస్తూ గ్రామ జనాభాను బట్టి స్మశానం విస్తీర్ణం ఉండాలని, అలా ఉందా లేదా, ముగ్గురు ఆర్.డి.ఓ లు తనిఖీ చేయాలనీ అన్నారు. అన్ని ఎస్.సి కాలనీలలో తనిఖీ చేసి స్మశానాలు ఎక్కడెక్కడ లేవో , ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో, ఎక్కడ ఆక్రమించ బడ్డాయో పరిశీలించి నివేదిక పంపాలన్నారు. ఉపాధి హామీ నిధులతో స్మశానాలు, వాటికీ రోడ్లు నిర్మాణానికి మంజూరు చేయడం జరుగుతోందని కలెక్టర్ తెలిపారు. మరో సభ్యులు చిట్టి బాబు మాట్లాడుతూ బాధితులకు పరిహారం చెల్లింపు ఆలస్యం అవుతోందని తెలుపగా నిధుల కోసం డి.ఓ లేఖ రాయడం జరిగిందని, తానే స్వయంగా మాట్లాడడం జరిగిందని, నిధులు రాగానే చెల్లించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. కొన్ని చోట్ల 2 గ్లాస్ ల విధానం ఇంకనూ అమలవుతోందని తెలుపగా చట్టం పై, చట్టం లో నున్న శిక్షల పై సభ్యులు, పోలీస్ శాఖ వారు అవగాహన కలిగించాలని కలెక్టర్ తెలిపారు. సభ్యులు చిట్టిబాబు, మజ్జి గణపతి, ఎం. రాము గ్రామాల్లో ఎస్.సి, ఎస్.టి కులాల వారి పై దాడులు జరుగుతున్నపుడు ఆర్.డి.ఓ, డి.ఎస్.పి తప్పనిసరిగా హాజరై విచారణ జరపాలని, హత్య కేసు లు నమోదైతే కలెక్టర్ , ఎస్.పి లు హాజరు కావలసి ఉంటుందని కోరారు. కలెక్టర్ స్పందిస్తూ ఆర్.డి.ఓ లు, డి.ఎస్.పి లు స్వయంగా హాజరు కావాలని సూచించారు. సమావేశం లో సభ్యులు లేవనెత్తిన అంశాలన్నిటికీ వచ్చే సమావేశం నాటికి పరిష్కారం లభించాలని, ఏక్షన్ టేకెన్ పై సభ్యులంతా సంతృప్తి చెందేలా చూడాలని సంబంధిత అధికారులు చర్యల పై దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఈ ఏడాది 4 త్రైమాసికం లో ఎస్.సి., ఎస్.టి దాడుల పై 17 కేసు లు నమోదయ్యాయని, అందులో 14 కేసులు ఇన్వెస్టిగేషన్ లో ఉన్నాయని తెలిపారు. ట్రయల్ లో ఉన్న కేసులను త్వరగా పరిష్కారం అయ్యేలా చూడాలని తెలిపారు. పరిహారం చెల్లింపులో 21.10.25 నుండి 15.12.2025 వరకు 49 కేసులలో 68 మంది కి గానూ 58 లక్షల 54 వేల రూపాయలను చెల్లించడం జరిగిందన్నారు.
జిల్లా ఎస్.పి దామోదర్ మాట్లాడుతూ ఎస్.సి., ఎస్.టి ల పై దాడుల కేసులలో పోలిసు యంత్రాంగం ఎల్లపుడు అప్రమత్తంగా ఉంటుందని, రెవిన్యూ వారి తో సహకరించడం జరుగుతోందని, అన్నారు. మరో సభ్యురాలు శ్రీ దేవి మాట్లాడుతూ గ్రామాల్లో పోక్సో చట్టం పై అవగాహన కలిగించాలని కోరగా ఎస్.పి స్పందిస్తూ ప్రతి వారం లో కనీసం రెండు కార్యక్రమాలు పోక్సో, గంజా , మత్తు పదార్ధాల పై కళాశాలల్లో, పాఠశాలల్లో నిర్వహిస్తున్నామని, ఇక పై గ్రామాల్లో కూడా నిర్వహిస్తామని తెలిపారు.
జిల్లో మాన్యువల్ స్కావెంజర్లు లేకుండా చూడాలని కలెక్టర్ సూచించారు. సభ్యులు చిట్టిబాబు మాట్లాడుతూ విజయనగరం పురపాలక సంస్థ లో రెండు చోట్ల మాన్యువల్ స్కావెంజర్లు ఉన్నారని తెలుపగా మున్సిపల్ కమీషనర్ వెరిఫై చేసి నివేదిక నివ్వాలని కలెక్టర్ సూచించారు.
ఈ సమావేశం లో జే.సి సేదు మాధవన్, అదనపు ఎస్.పి సౌమ్య లత, డి.ఆర్.ఓ మురళి , డి.ఎస్.పి లు, ఆర్.డి.ఓ లు, సోషల్ వెల్ఫేర్ డి.డి. అన్నపూర్ణమ్మ, జిల్లా అధికారులు, సభ్యులు సున్నపు రామస్వామి, ఎం.రాము, తదితరులు పాల్గొన్నారు.
…………………………………………………………………………………………………….
జారీ ః జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖాధికారి, విజయనగరం

241225-A