రాజ్యాంగం మనకు వరం, జాయింట్ కలెక్టర్ ఎస్.సేధు మాధవన్, అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన జెసి
Publish Date : 27/11/2025
రాజ్యాంగం మనకు వరం
జాయింట్ కలెక్టర్ ఎస్.సేధు మాధవన్
అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన జెసి
మెరకముడిదాం, (విజయనగరం), నవంబరు 26 ః ప్రపంచంలోనే అతిగొప్పదిగా కొనియాడబడుతున్న మన రాజ్యాంగం దేశప్రజలకు ఒక వరమని జాయింట్ కలెక్టర్ ఎస్.సేధు మాధవన్ పేర్కొన్నారు. దేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా తీర్చిదిద్దినది మన రాజ్యాంగమేనని ఆయన స్పష్టం చేశారు.
మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల సముదాయంలో కొత్తగా ఏర్పాటు చేసిన భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని, భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్ బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అందరిచేతా ప్రతిజ్ఞ చేయించారు. భారత రాజ్యాంగ విశిష్టతను, అంబేద్కర్ గొప్పదనాన్ని జెసి కొనియాడారు. ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగాన్ని రచించిన ఘనత అంబేద్కర్‌కే దక్కిందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో చీపురుపల్లి ఆర్‌డిఓ సత్యవాణి, తాహసీల్దార్ సులోచనారాణి, ఎంపిడిఓ భాస్కర్రావు, ఏఓ శ్రావణి, ఇతర మండల అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు ప్రక్రియను తనిఖీ చేసిన జెసి
మండలంలోని గర్భాం రైతు సేవా కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ ఎస్.సేధు మాధవన్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇక్కడి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. చేసిన ఏర్పాట్లపై ఆరా తీశారు. రికార్డులను పరిశీలించారు. రైతులు ఇబ్బంది పడకుండా సమర్ధవంతంగా కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని జెసి ఆదేశించారు.
……………………………………………………………………………………………………
జారీ ః జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖాధికారి, విజయనగరం.