Close

శివారు భూములకూ సాగునీరు అందాలి, మడ్డువలస రిజర్వాయర్ ను పరిశీలించిన కలెక్టర్ రాంసుందర్ రెడ్డి

Publish Date : 24/10/2025

శివారు భూములకూ సాగునీరు అందాలి

మడ్డువలస రిజర్వాయర్ ను పరిశీలించిన కలెక్టర్ రాం సుందర్ రెడ్డి

వంగర (విజయనగరం), అక్టోబర్ 24.:      మడ్డువలస రిజర్వాయర్ శివారు భూములకి సైతం సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాం సుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆయన వంగర మండలంలో శుక్రవారం పర్యటించారు.  మడ్డువలస రిజర్వాయర్ ను పరిశీలించారు. ప్రాజెక్టులోకి నీటి ప్రవాహ స్థితిగతులపై ఆరా తీశారు ఆ ప్రాజెక్ట్ కింద సాగులో ఉన్న భూమి నీటి ప్రవాహ స్థితిని ఆరా తీశారు మ్యాప్లను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

        ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాజెక్టు లక్ష్యం పూర్తిగా నెరవేరేలా శివారు భూములకు కూడా సాగునీరు అందించేందుకు చర్యలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. సాగునీటి కాలవలో పూడికను తొలగించడానికి, ఇరువైపులా గట్లను బలోపేతం చేయడానికి, అవసరమైన చోట లైనింగ్ నిర్వహించేందుకు  ప్రతిపాదన తయారు చేయాలని సూచించారు. నీటి పన్ను వసూలు చేసి, ఆ డబ్బులతో లష్కర్లకు జీతాలు చెల్లించాలని  సూచించారు.

         ఈ కార్యక్రమంలో మడ్డువలస ఈఈ పి.గోవిందరావు, డీఈలు పి.అర్జున్, పి.నాగేశ్వర పట్నాయక్, ఏఈ నితిన్, ఇంచార్జ్ తాసిల్దార్ పి. రామారావు ఇతర మండల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

…………………………………………………………………………………………

జారి : జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి, విజయనగరం.

24-10-2025

24-10-2025

24-10-2025

24-10-2025