Close

👉అక్టోబర్ 9. 10 జరిగే పోటీలకు దరఖాస్తుల గడువు పెంపు 👉 ఈ నెల 5 వ తేదీ లోగా దరఖాస్తులు చేసుకోవాలి 👉 జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి

Publish Date : 01/10/2022

👉అక్టోబర్ 9. 10 జరిగే పోటీలకు దరఖాస్తుల గడువు పెంపు

👉 ఈ నెల 5 వ తేదీ లోగా దరఖాస్తులు చేసుకోవాలి

👉 జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి

విజయనగరం, అక్టోబరు 01; విజయనగరం ఉత్సవాల్లో భాగంగా జిల్లాకు చెందిన గాయకులకు నిర్వహించనున్న సినీ, లలిత సంగీత పోటీల గడువును ఈ నెల 5వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి ఒక ప్రకటన లో తెలిపారు. అక్టోబర్ 9,10 తేదీలలో ఆర్.టి.సి బస్సు స్టాండ్ ఎదురుగా నున్న రెవిన్యూ కళ్యాణ మండపం నందు జరుగు ఈ పోటీలలో 15 నుండి 45 సంవత్సరముల వయసు గల స్త్రీ పురుషులు అర్హులని తెలిపారు. ఆసక్తి గలవారు తమ దరఖాస్తులను కలెక్టరేట్ లో నున్న జిల్లా సమాచార పౌర సంబ్వంధాల శాఖ కార్యాలయానికి నేరుగా గానీ diprovizianagaram@gmail.com మెయిల్ ద్వారా గానీ పంపవచ్చని తెలిపారు. దరఖాస్తుదారు తమ బయో డేటా , చిరునామా, మొబైల్ నెంబర్ తదితర వివరాలను పూరింఛి దరఖాస్తులను మెయిల్ కు లేదా నేరుగా అందజేయవచ్చని తెలిపారు. అభ్యర్ధులు దరఖాస్తు తో పాటు ప్రవేశ రుసుముగా 100 రూపాయలను చెల్లించ వలసి ఉంటుందని తెలిపారు. రుసుమును నేరుగా లేదా నగదు రూపం లో గానీ 9618188624 నారాయణ రావు కు ఫోన్ పే ద్వారా చెల్లించి స్క్రీన్ షాట్ ను పెట్టవలసి ఉంటుందని స్పష్టం చేసారు. దరఖాస్తులను సెప్టెంబర్ 30 వ తేదీ లోగా అందేలా పంపాలన్నారు. పోటీలలో పాల్గొనే వారికీ ప్రధమ, ద్వీతీయ, తృతీయ బహుమతులతో పాటు మేమెంటో, సర్టిఫికేట్ లను అందజేయడం జరుగుతుందన్నారు. అస్లీల సాహిత్యం ఉన్న పాటలు నిషిద్ధమని, పాల్గొనే వారందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికేట్లను అందిస్తామని తెలిపారు. మిగిలిన వివరాలకు 9121215263 మొబైల్ నెంబర్ ను సంప్రదించాలని తెలిపారు.

శాస్త్రీయ సంగీత పోటీలను కూడా ఇదే వేదిక వద్ద 9,10 తేదీలలో నిర్వహిస్తున్నామని, ఈ విభాగానికి చెందిన దరఖాస్తులను ఇంచార్జ్ అధికారి అయిన జిల్లా ఆడిట్ ఆఫీసర్ కార్యాలయానికి అందించాలని తెలిపారు.