01.12.2025 పి.జి.ఆర్.ఎస్. వినతులను త్వరితగతిన పరిష్కరించాలి, ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్)కు విశేష స్పందన, పిర్యాదుదారుల నుండి 201 వినతుల స్వీకరణ, ఆర్జిదారుల సమస్యల పరిష్కారంపై సంబంధింత అధికారులను ఆదేశాలు జారీ -జిల్లా కలక్టరు ఎస్ రాంసుందర్
Publish Date : 02/12/2025
పత్రికా ప్రకటన-4
పి.జి.ఆర్.ఎస్. వినతులను త్వరితగతిన పరిష్కరించాలి
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్)కు విశేష స్పందన
పిర్యాదుదారుల నుండి 201 వినతుల స్వీకరణ
ఆర్జిదారుల సమస్యల పరిష్కారంపై సంబంధింత అధికారులను ఆదేశాలు జారీ
– జిల్లా కలక్టరు ఎస్ రాంసుందర్ రెడ్డి
విజయనగరం, డిశంబరు, 1: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) కు వచ్చిన వినతులను త్వరితగతిన పరిష్కారించాలని సంబంధిత అధికారులకు జిల్లా కలక్టరు ఎం .రాంసుందర్ రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలక్టరు ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్)కు విశేష స్పందన లభించింది. జిల్లా కలక్టరు, జాయింటు కలక్టరు, స్పెషల్ డిప్యూటి కలక్టర్లు ప్రజల నుండి ధరఖాస్తులు స్వీకరించి వారి సమస్యలను సాదవధానంగా విన్నారు. ఫిర్యాదుల నుండి 201 వినతులు స్వీకరించి, వినతులపై తగు పరిష్కారం, చర్యలు చేపట్టుటకు సంబంధింత అధికారులను కలక్టరు ఆదేశాలు జారీచేసారు. రెవెన్యు శాఖకు సంబంధించి 73 వినతులు, డిఆర్డిఎ సంబంధించి 32 వినతులు, గ్రామ సచివాలయం శాఖకు సంబందించి 12 వినతులు, మున్సిపల్ శాఖ-6, విద్యా శాఖ – 3, పంచాయితీ శాఖ-10, విద్యుత్ శాఖ-3, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ-2, హౌసింగు-7, పంచాయితీ శాఖ-13, ఇతర శాఖ నుండి 50 వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాటాలడుతు అధికారులు అర్జీదారును కలిసి, మాట్లాడిన తర్వాతనే ఎండార్స్మెంట్ ఇవ్వాలని ఆదేశించారు. అర్జీదారునితో మాట్లాడిన తేదీ, సమయం కూడా వారి రిపోర్ట్ లో నమోదు చేయాలన్నారు. పిజిఆర్ఎస్ టోల్ ఫ్రీ నెంబర్ 1100 పై ప్రజలకు అవగాహన కలిగించాలని తెలిపారు. ఈ నెంబర్ కు అందిన కాల్స్ కు కూడా సంబంధిత అధికారి సమాధానం సరైన రీతిలో అందజేయవలసి ఉంటుందన్నారు. ఆర్జిదారుల సమస్యల పరిష్కారంపై సంబంధింత అధికారులను తగు చర్యలు, సత్వర పరిష్కారానిని చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీచేసారు.
ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జాయింటు కలక్టరు సేతు మాధవన్, స్పెషల్ డిప్యూటి కలెక్టర్లు మురళి, డి.వెంకటేశ్వర రావు, రాజేశ్వరి, ప్రమీల గాంధీ, బి. శాంతి, కళావతి , సర్వే శాఖ ఎ.డి. ఆర్.విజయకుమార్, కలక్టరేటు పరిపాలనాధికారి దేవి ప్రసాద్, సి.పి.ఒ. బాలజి, జిల్లా విద్యాశాఖాధికారి మణిక్యంయుడు, వ్యవసాయ శాఖ జెడి, సాంఘిక సంక్షేమ శాఖ డిడి అన్నపూర్ణమ్మ, బి.సి.సంక్షేమ అధికారి జ్యోతిశ్రీ, ఆర్.డబ్ల్యుఎస్ మరియు ఆర్ అండ్ బి ఎస్.ఇ.లు మార్కఫెడ్ మేనేజరు వెంకటేశ్వరరావు, విజయనగరం, ఐ.సిడి.ఎస్. పి.డి. విమలరాణి, డిఆర్ డి ఎ పిడి శ్రీనివాస్ పాణి, మైక్రోఇరిగేషన్ పి.డి. లక్ష్మీనారాయణ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
———————————————————————————————-
జారీ: జిల్లా సమాచార పౌరసంబంధాల అధికారి, విజయనగరం

1-12-1

1-12-2

1-12-3