01.12.2025-ఎయిడ్స్‌పట్ల అవగాహన కల్పించాలి జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి పట్టణంలో భారీ ర్యాలీ
Publish Date : 01/12/2025
పత్రికా ప్రకటన
–
ఎయిడ్స్‌పట్ల అవగాహన కల్పించాలి
జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి
పట్టణంలో భారీ ర్యాలీ
విజయనగరం, డిసెంబరు 01 ః
హెచ్ఐవి, ఎయిడ్స్ పట్ల విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి సూచించారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా స్థానిక ఆర్‌టిసి కాంప్లెక్స్ వద్ద అవగాహనా ర్యాలీని సోమవారం జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. స్థానిక ఐఎంఏ భవనం వరకు ఈ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎయిడ్స్ పట్ల అప్రమత్తంగా ఉండేందుకు నిరంతరం అవగాహనా కార్యక్రమాలను నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఎయిడ్స్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా అవగాహన కల్పించాలని సూచించారు. ఎయిడ్స్, హెచ్ఐవి వ్యాధిగ్రస్తులపట్ల వివక్షత చూపించకూడదని, వారు కూడా సమాజంలో భాగమేనని అన్నారు. దీనికోసమే ప్రతీఏటా డిసెంబరు 1న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి, డిఎల్ఎస్ఏ సెక్రటరీ ఎ.కృష్ణప్రసాద్, డిఎంఅండ్‌హెచ్ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి, జిల్లా ఎయిడ్స్ నియంత్రాణాధికారిణి డాక్టర్ కె.రాణి, సెట్విజ్ సిఈఓ వి.విశ్వేశ్వర్రావు, రెడ్‌క్రాస్ ఛైర్మన్ కెఆర్‌డి ప్రసాద్, వైద్యాధికారులు, వివిధ సంస్థల ప్రతినిధులు, నర్సింగ్ విద్యార్ధినులు పాల్గొన్నారు.
……………………………………………………………………………………………………….
జారీ ః జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖాధికారి, విజయనగరం

1-12-1

1-12-2

1-12-3

1-12-4