01.12.2025-పింఛన్లను పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదే ఉద్యాన పంటలవైపు దృష్టి సారించాలి రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పెదమానాపురంలో పింఛన్ల పంపిణీ
Publish Date : 01/12/2025
పత్రికా ప్రకటన
పింఛన్లను పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదే
ఉద్యాన పంటలవైపు దృష్టి సారించాలి
రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్
పెదమానాపురంలో పింఛన్ల పంపిణీ
దత్తిరాజేరు, (విజయనగరం), డిసెంబరు 01 ః
పింఛన్లను రూ.4వేలకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిదేనని రాష్ట్ర చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలు, పేదరిక నిర్మూలన, ఎన్నారై సాధికారతా సంబంధాల శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. దత్తిరాజేరు మండలం పెదమానాపురంలో ఎన్టిఆర్ భరోసా పింఛన్ల పంపిణీని ఆయన సోమవారం ప్రారంభించారు. ఇంటింటికీ వెళ్లి పింఛన్ మొత్తాన్ని అందజేశారు. గ్రామస్తులతో మమేకమై, వారి సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ, పేదల సమస్యలను అర్ధం చేసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సామాజిక పింఛన్లను రూ.వెయ్యి నుంచి రూ.2వేలకు, ఆ తరువాత రూ.3వేల నుంచి ఒకేసారి రూ.4వేలకు పెంచి వారిని ఆదుకున్నారని చెప్పారు. గత ప్రభుత్వ హాయాంలో పింఛన్‌ను రూ.2వేలు నుంచి రూ.3వేలకు పెంచడానికి ఐదేళ్లు పట్టిందని అన్నారు. పేదల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కట్టుబడి ఉండేది టిడిపి ప్రభుత్వమేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా, అభివృద్ది, సంక్షేమం రెండు కళ్లుగా పాలన సాగుతోందని చెప్పారు. తప్పుదోవ పట్టించిన వ్యవస్థను ముఖ్యమంత్రి తన అపార అనుభవంతో గాడిన పెడుతున్నారని అన్నారు. నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తున్నామని చెప్పారు. 20 లక్షల ఉద్యోగాలను కల్పించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. అభివృద్ది కోసం ప్రభుత్వంతో కలిసి నడవాలని కోరారు. ఎంత ధాన్యం పండించినా కొనడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని, అయితే వరిపంట వల్ల పెద్దగా గిట్టుబాటు కావడం లేదని చెప్పారు. అందువల్ల ఉద్యానపంటలవైపు దృష్టి సారించాలని మంత్రి కోరారు.
ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఏ పిడి శ్రీనివాస్ పాణి, ప్రత్యేకాధికారి టి.విమలారాణి, ఎంపిడిఓ రవికిషోర్, స్థానిక అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
……………………………………………………………………………………………………….
జారీ ః జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖాధికారి, విజయనగరం.

1-12-1

1-12-1