Close

05.11.2025 రెవిన్యూ సేవల కోసం అందిన వినతులు పెండింగ్ ఉంటె సహించేది లేదు • రీ సర్వే లో తప్పులు లేకుండా చూడాలి • ప్రైవేటు దేవాలయాల్లో సి సి కెమెరాలను ఏర్పాటు చేయాలి • రెవిన్యూ అధికారుల సమావేశం లో స్పష్టం చేసిన జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి

Publish Date : 06/11/2025

పత్రికా ప్రకటన-5

  • రెవిన్యూ సేవల కోసం అందిన  వినతులు పెండింగ్ ఉంటె సహించేది లేదు
  • రీ సర్వే లో  తప్పులు లేకుండా చూడాలి
  • ప్రైవేటు దేవాలయాల్లో సి సి కెమెరాలను ఏర్పాటు చేయాలి
  • రెవిన్యూ అధికారుల సమావేశం లో స్పష్టం చేసిన జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి

విజయనగరం, నవంబర్  05 :    రెవిన్యూ సేవల  కోసం  అందిన దరఖాస్తులను గడువు లోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి   తెలిపారు.  ఇళ్ళ స్థలాలు, ఓ.బి.సి  సర్టిఫికేట్ , ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్స్, మ్యుటేషన్  తదితర  సేవల కోసం అందిన దరఖాస్తులు నిర్దేశిత గడువు దాటకుండా పరిష్కారం కావాలన్నారు.   రెవిన్యూ అధికారులకు  ఇది బేసిక్ విధి యని, దీనిని నిర్లక్ష్యం చేయకూడదని హితవు పలికారు.  ఆర్.డి.ఓ లు డైలీ దీని పై తహసిల్దార్లతో సమీక్షించాలని సూచించారు.   బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవిన్యూ అధికారులతో సమీక్షించారు.  మీ సేవ ఆన్లైన్ సర్వీసెస్ , రీ సర్వే , ధాన్యం సేకరణ , రెవిన్యూ కలెక్షన్స్ , హౌసింగ్, ఐ.వి.ఆర్.ఎస్ ఫీడ్ బ్యాక్ , పిజిఆర్ఎస్ , క్షేత్ర స్థాయి సందర్శనలు, ప్రభుత్వ భూముల అసైన్మెంట్ , వేబ్లాండ్ మ్యుటేషన్స్ ,  ఈ పంట , రైస్ కార్డ్స్, దేవాదాయ భూములు,  తదితర అంశాల పై సమీక్షించారు.

            మండల వారీగా పెండింగ్  ఉన్న వినతుల పై ఆరా తీసారు.  ఎందుకు గడువు దాటి ఉంటున్నాయని కారణాలను అడిగారు.  ఇక పై డివిజన్ స్థాయి లోనే సమీక్షించడం జరుగుతుందని, పెండింగ్  ఉన్న వినతుల పై బ్రేక్ అప్ కావాలని, మండల వారీగా  ఎన్ని అందాయి, ఎన్ని పరిష్కారం అయ్యాయి, పెండింగ్  ఉన్నవాటికి కారణాలు  సవివరంగా తెలియజేయవలసి ఉంటుందన్నారు.

రీ సర్వేలో తప్పులు లేకుండా  చేయాలనీ,  క్షేత్ర స్థాయి కి వెళ్లి ఆర్.డి.ఓ లు కూడా పరిశీలించాలని తెలిపారు. తహసిల్దార్లు రీ సర్వే లో జాగ్రత్త వహించాలని, లేదంటే అనేక గొడవలకు తావిచ్చిన వారవుతారని  అన్నారు.

ప్రైవేటు దేవాలయాల్లో రోజులో కనీసం  వెయ్యిమంది  భక్తులు హాజరయ్యే దేవాలయాల వద్ద సి సి కెమెరాలను ఏర్పాటు చేయాలనీ , దేవాదాయ శాఖ, రెవిన్యూ అధికారులు పర్యవేక్షించాలని  తెలిపారు.

జే.సి సేదు మాధవన్ మాట్లాడుతూ ధాన్యం సేకరణ సక్రమంగా జరిగేల ఆర్.డి.ఓ లు, తహసిల్దార్లు జాగ్రత్త వహించాలని తెలిపారు.  జిల్లా స్థాయి లో  సిక్క్షనా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని , మండల స్థాయి, గ్రామా స్థాయి లో కూడా వెంటనే జరపాలని తెలిపారు.

ఈ సమావేశం లో జే.సి సేదు మాధవన్, డి.ఆర్.ఓ శ్రీనివాస మూర్తి, ఆర్.డి.ఓ లు, కీర్తి, రాం మోహన్ , సత్య వాణి , డిప్యూటీ కలెక్టర్లు , హౌసింగ్ పి.డి. మురళీ, జిల్లా వ్యవసాయాధికారి తారక రామా రావు, సర్వే ఏ.డి. లు, తహసిల్దార్లు, డి.టి లు, సర్వేయర్లు  తదితరులు పాల్గొన్నారు.

…………………………………………………………………………………………………….

జారీ ః జిల్లా స‌మాచార పౌర సంబంధాల శాఖాధికారి, విజ‌య‌న‌గ‌రం.

5-11-A

5-11-A

5-11-B

5-11-B

5-11-C

5-11-C