Close

05.110.2025 ప్ర‌భుత్వ సేవ‌లు స‌త్వ‌ర‌మే అందాలి, జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి

Publish Date : 06/11/2025

ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌-2

ప్ర‌భుత్వ సేవ‌లు స‌త్వ‌ర‌మే అందాలి

జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి

పూస‌పాటిరేగ‌, డెంకాడ‌,(విజ‌య‌న‌గ‌రం), న‌వంబ‌రు 05 ః       ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వ సేవ‌ల‌ను త‌క్ష‌ణ‌మే అందించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి ఆదేశించారు. ఆయ‌న బుధ‌వారం డెంకాడ‌, పూస‌పాటిరేగ మండ‌లాల్లో ఆక‌స్మిక త‌నిఖీ నిర్వ‌హించారు. ముందుగా డెంకాడ తాహ‌సీల్దార్ కార్యాల‌యాన్ని సంద‌ర్శించారు. రాష్ట్ర‌ప్ర‌భుత్వం ఆన్‌లైన్ ద్వారా అందిస్తున్న సేవ‌ల‌పై త‌హ‌సీల్దార్ రాజారావును ఆరా తీశారు. ధ‌ర‌ఖాస్తులను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిష్క‌రిస్తూ, పెండింగ్ లేకుండా చూడాల‌ని ఆదేశించారు. నిర్ణీత కాల‌వ్య‌వ‌ధిలోగా ప‌రిష్కారం చూపాల‌ని సూచించారు.

                   పూస‌పాటిరేగ మండ‌లంలో క‌లెక్ట‌ర్ ప‌ర్య‌టించారు. ముందుగా ఎంపిడిఓ కార్యాల‌యాన్ని ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. అధికారులు అందుబాటులో లేక‌పోవ‌డంతో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అనంత‌రం త‌హ‌సీల్దార్ కార్యాల‌యాన్ని సంద‌ర్శించారు. ఆన్‌లైన్ సేవ‌ల‌పై ప్ర‌శ్నించారు. పెండింగ్‌లో లేకుండా చూడాల‌ని, నిర్ణీత సమ‌యంలోగా సేవ‌ల‌ను అందించాల‌ని డిటి సంజీవ్‌కుమార్‌ను క‌లెక్ట‌ర్‌ ఆదేశించారు.

…………………………………………………………………………………………………….

జారీ ః జిల్లా స‌మాచార పౌర సంబంధాల శాఖాధికారి, విజ‌య‌న‌గ‌రం.

5-11-A

5-11-A

5-11-B

5-11-B