05.12.2025 జిల్లా అభివృద్ధి సూచికలుమెరుగుపరచాలి– జిల్లాకలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి
Publish Date : 06/12/2025
పత్రికా ప్రకటన-6
జిల్లా అభివృద్ధి సూచికలు మెరుగుపరచాలి
— జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి
విజయనగరం, డిసెంబర్ 05: జిల్లాలో విధులు నిర్వహిస్తున్న వివిధ శాఖల పనితీరుపై జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి సూచికలు (Key Performance Indicators – KPIs) లో జిల్లా పలు విభాగాల్లో వెనుకబడటం ఆందోళనకరమని పేర్కొన్నారు. ముఖ్యంగా పరిశ్రమలు, మహిళా, శిశు సంక్షేమ, పోలీసు, ఫిషరీస్, పశుసంవర్ధక, ఉద్యాన శాఖలు తమ ప్రగతిని గణనీయంగా మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు.
జిల్లా గ్రోత్ రేట్‌ను పెంచి ముందువరుసలో నిలపడం లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. అందుకు ప్రతి శాఖ కూడా క్షేత్రస్థాయిలో నిజమైన, రియలిస్టిక్ డేటా సిద్ధం చేయాలని ఆదేశించారు. అవగాహన లోపంతో తప్పుడు లేదా అస్పష్ట డేటా నమోదు చేయడాన్ని సహించేది లేదని హెచ్చరించారు. ఆయా శాఖలు తమ పరిధిలో సమీక్షలు, టెలికాన్ఫరెన్సులు నిర్వహించి సిబ్బందిలో అవగాహన పెంచాలని సూచించారు. లక్ష్యాలు, పురోగతి, ఫీల్డ్ డేటా నాణ్యతపై పర్యవేక్షణ పెంచాలని పేర్కొన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్ నుండి సీపీఒ బాలాజీ పాల్గొన్నారు.
===========
జారీ : జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, విజయనగరం.

5-12-1

5-12-2