Close

1.64 crore for construction of houses for lay out development District Collector A. Suryakumari

Publish Date : 03/01/2022

లే అవుట్ల అభివృద్దికి రూ.1.64కోట్లు
ఇళ్ల నిర్మాణాన్ని వేగ‌వంతం చేయాలి
జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి
విజ‌య‌న‌గ‌రం, డిసెంబ‌రు 31 ః
లే అవుట్లలో మౌలిక స‌దుపాయాల‌ను క‌ల్పించేందుకు రాష్ట్ర‌ ప్ర‌భుత్వం జిల్లాకు రూ.1.64కోట్లు మంజూరు చేసింద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఎ.సూర్య‌కుమారి ఒక ప్ర‌క‌ట‌న ద్వారా తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల అభ‌ర్ధనను దృష్టిలో పెట్టుకొని, వై యస్ ఆర్ జగనన్న కాలనీల్లో  అత్యవసరమైన మౌలిక సదుపాయాల క‌ల్ప‌న‌కు ఈ నిధుల‌ను కేటాయించ‌డం జ‌రిగింద‌న్నారు.  అప్రోచ్ రోడ్లు, విద్యత్ లైన్ల మార్పిడి,  లే అవుట్ స్థలాల‌ను చదును చేయుట మొదలగు పనులకు ఈ నిధుల‌ను వెచ్చించ‌డం జ‌రుగుతుంద‌ని తెలిపారు. వీటికోసం రాష్ట్ర వ్యాప్తంగా రూ. 17.25 కోట్లు మంజూరు కాగా,  దీనిలో జిల్లాకు రూ.1.64కోట్లు కేటాయించిన‌ట్లు తెలిపారు.  లే అవుట్లలో నీటి సదుపాయం క‌ల్పించేందుకు చేప‌ట్టిన‌ పనుల బిల్లులను చెల్లించేందుకు,  రాష్ట్ర వ్యాప్తంగా రూ 40.00 కోట్లు మంజూరు చేయడం జరిగినదని తెలిపారు. దీనిలో జిల్లాకు రూ.2 కోట్లు కేటాయించ‌డం జ‌రిగింద‌ని, వీటితో పెండింగ్ బిల్లుల‌ను చెల్లించ‌డం జ‌రుగుతుంద‌ని వివ‌రించారు.
         న‌వ‌ర‌త్నాలులో భాగంగా పేద‌లంద‌రికీ ఇళ్లు కార్య‌క్ర‌మానికి ప్ర‌భుత్వం అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తోంద‌ని, బిల్లులు త్వ‌ర‌గా చెల్లించేందుకు చ‌ర్య‌లు తీసుకుంద‌ని క‌లెక్ట‌ర్ తెలిపారు. ల‌బ్దిదారులు త‌మ ఇంటి నిర్మాణాన్ని వేగ‌వంతం చేసి, త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని కోరారు.
1.64 crore for construction of houses for lay out development District Collector A. Suryakumari