10.02.2026-సాంకేతికతను ఉపయోగిస్తూ అప్రమత్తం గా ఉండాలి.కుటుంబసభ్యులకు సైబర్ నేరాలు పై అవగాహన కల్పించాలి.సురక్షిత అంతర్జాల దినం కార్యశాలలో జిల్లా రెవిన్యూఅధికారి మురళి
Publish Date : 11/02/2026
పత్రికా ప్రకటన
సాంకేతికతను ఉపయోగిస్తూ అప్రమత్తం గా ఉండాలి.
కుటుంబసభ్యులకు సైబర్ నేరాలు పై అవగాహన కల్పించాలి.
సురక్షిత అంతర్జాల దినం కార్యశాలలో జిల్లా రెవిన్యూ అధికారి మురళి.
విజయనగరం ఫిబ్రవరి 10 : ప్రస్తుత తరుణం లో ప్రతి ఒక్కరూ ఆధునిక పరికరాలు ఇంటర్ నెట్ అనుసంధానం తో విరివిగా ఉపయోగిస్తున్నారని అందువలన ఇంటర్నెట్ ద్వారా మోసాలుకు గురికాకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముందని జిల్లా రెవిన్యూ అధికారి మురళి అన్నారు. కలెక్టర్ కార్యాలయం ఆడిటోరియంలో ఎన్ఐసి ఆధ్వర్యంలో జరిగిన సురక్షిత అంతర్జాలం దినం కార్యశాలలో పాల్గొని ప్రసంగించారు.
ఈసందర్భంగా మాట్లాడుతూ మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం వలన ఆధునిక మొబైల్ ఫోన్లు అందరికీ అందుబాటులో ఉన్నాయని అవి అవసరం మేరకే వినియోగించాలని అన్నారు. అంతర్జాలం ద్వారా ఆన్లైన్ మోసాలకు గురికాకుండా ఉండాలంటే మొబైల్ ఫోన్లు, డెస్క్ టాప్, లాప్ టాప్ లకు రెండు అంచల భద్రత ఏర్పాటుచేసుకోవాలని ఎప్పటికప్పుడు పాస్‌వర్డులు మార్చుకోవాలని సూచించారు. పరిచయం లేని వ్యక్తులనుండి సంక్షిప్త సందేశాలు , వీడియో కాల్, లింకుల రూపం లో వస్తే సమాధానం ఇవ్వరాదని అన్నారు. వ్యక్తిగత సమాచారం దోపిడీ చేయుటకోసం ఆన్లైన్ ద్వారా మాల్ వేర్/ స్పై వేర్ ద్వారా కంప్యూటర్, మొబైల్ ఫోన్ లలో ఉన్న సమాచారం తస్కరించేందుకు అవకాశం ఉన్నందున అనవసరమైన అప్లికేషన్స్ ఉపయోగించరాదని సూచించారు. అదే విధంగా ప్రతి ఒక్కరూ ఆన్లైన్/సైబర్ మోసాల గురించి కుటుంబసభ్యులకు కూడా వివరించాలని అన్నారు.
ఈ కార్యశాలలో జిల్లా ఎన్ఐసి అధికారి బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సురక్షిత ఇంటర్నెట్ వినియోగం/భద్రత , ఓటిపి నేరాలు, నకిలీ వెబ్సైట్స్, ఎ ఐ ఆధారిత నేరాలు, మొబైల్ ఫోన్లు విస్తృత వినియోగం వలన కలిగే నష్టాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు వివరించారు .
ఈకార్యక్రమం లో జిల్లా గణాంక అధికారి బాలాజీ, జిల్లా పంచాయతీ అధికారి మల్లికార్జున రావు, కలెక్టర్ కార్యాలయం అధికారులు, సిబ్బంది, వివిధ శాఖల సిబ్బంది, కళాశాలల విద్యార్ధులు పాల్గొన్నారు
—————————————————-
జారీ: జిల్లా సమాచార పౌరసంబంధాల అధికారి, విజయనగరం

10-2-1

10-2-2

10-2-3