Close

11.11.2025-పెట్టుబడులకు ఆకర్షితులు కావడం కాదు- పెట్టుబడులు పెట్టే స్థాయికి ఎదగాలి

Publish Date : 12/11/2025

పత్రికా ప్రకటన

పెట్టుబడులకు ఆకర్షితులు కావడం కాదు- పెట్టుబడులు పెట్టే స్థాయికి ఎదగాలి

వర్చువల్ గా కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ కి శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి

విజయనగరం, నవంబర్ 11:  పెట్టుబడులకు ఆకర్షితులు కావడమే కాక పెట్టుబడులు పెట్టే స్థాయికి యువత ఎదగాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. మంగళవారం ప్రకాశం జిల్లా కనిగిరి నుండి వర్చువల్ గా రాష్ట్రంలో అనేక కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు ముఖ్యమంత్రి చేశారు. విజయనగరం జిల్లా వంగర మండలం అరసాడలో 102 కోట్ల రూపాయల పెట్టుబడితో ప్రారంభించనున్న కంప్రెసర్ బయోగ్యాస్ ప్లాంట్ కు ముఖ్యమంత్రి వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. రాజాం తహసిల్దారు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి, రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి, రాజాం శాసన సభ్యులు కొండ్రు మురళీమోహన్ , విజయనగరం శాసనసభ్యులు అదితి గజపతి రాజు, పారిశ్రామికవేత్త పి రామ్మోహన్ రావు పాల్గొన్నారు.

 ఈ సందర్భంగా  ముఖ్యమంత్రి తో పారిశ్రామికవేత్త రామ్మోహన రావు ఇంటరాక్ట్ అయ్యారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ పేదరికంలో పుట్టి పెట్టుబడిదారీగా ఎదిగినందుకు రామ్మోహన్ ను అభినందించారు. యువ పారిశ్రామిక వేత్తలు మట్టిలో మాణిక్యాలుగా అభివర్ణిస్తూ ప్రభుత్వం ఇచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడం మీ వంతని పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి అన్నారు. ప్రతి ఇంటి  నుండి ఒక శ్రామికవేత్త రావాలని వారు 10 మందికి స్ఫూర్తి కావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

 ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వంగర మండలం అరసాడ లో నిర్మించనున్న బయోగ్యాస్ ప్లాంట్ 13.8 2 ఎకరాల స్థలంలో నిర్మించనున్నట్లు తెలిపారు. దీని ద్వారా 500 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని పేర్కొన్నారు. ఒక ఏడాది కాలంలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయనున్నట్లు తెలిపారు.

రామ్మోహన్ రావు ముఖ్యమంత్రితో మాట్లాడుతూ నిరుపేద కుటుంబంలో పుట్టిన తాను బీటెక్ లో గోల్డ్ మెడల్ సాధించానని,  2017లో విశాఖలో జరిగిన సిఐఐ సదస్సులో తమరి సమక్షంలో ఎం ఓ యు జరిగిందని గుర్తు చేసారు.   అప్పటినుండి ముఖ్యమంత్రి గారి స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు కొన సాగిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 500 కోట్ల  స్థాయికి ఎదిగానని అందుకు తోడ్పడిన తమకురుణపడి ఉంటానని తెలిపారు. ముఖ్యమంత్రి చేపట్టిన సంస్కరణలు తనలాంటి ఎంతోమంది యువతకు మార్గదర్శకం అయ్యాయని, ముఖ్యమంత్రి  ప్రోత్సాహంతో ఉపాధి అవకాశాలు అందుకుంటున్నారని అన్నారు. తాను ప్రారంభించబోయే బయోగ్యాస్ ప్లాంట్ వల్ల ప్రత్యక్షంగా 500 మందికి పరోక్షంగా 5000 మంది రైతులకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు.

కార్యక్రమం లో భాగంగా, రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖ మాత్యులు, జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి, రాజాం ,విజయనగరం శాసనసభ్యులు కొండ్రు మురళీమోహన్, అదితి గజపతిరాజు, పారిశ్రామికవేత్త పి. రామ్మోహన్రావు బయో గ్యాస్ ప్లాంట్ శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

==========

జారీ : డిఐపిఆర్ఒ, విజయనగరం

11-11-A

11-11-A

11-11-B

11-11-B

11-11-C

11-11-C