120 requests for response, quality redressal should take place, District Collector Suryakumari

Publish Date : 24/05/2022
120 requests for response, quality redressal should take place, District Collector Suryakumari

స్పందనకు 120 వినతులు

క్వాలిటీ రెడ్రెస్సల్ జరగాలి

జిల్లా కలెక్టర్ సూర్యకుమారి

విజయనగరం, మే 23:  సోమవారం కలెక్టరేట్ నందు నిర్వహించిన స్పందన  కు ప్రజల నుండి 120 వినతులు అందాయి. వీటిలో వైద్య శాఖకు 10,  డి.ఆర్.డి.ఏ కు 07 అందగా  రెవిన్యూ కు సంబంధించి 103 వినతులు అందాయి. ముఖ్యంగా  సదరం, పింఛన్లు, ఇళ్ల స్థలాలు, గృహాల కోసం విజ్ఞప్తులు వచ్చాయి. ఈ వినతులు జిల్లా కలెక్టరు ఎ. సూర్య కుమారి, సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్, జిల్లా రెవిన్యూ అధికారి గణపతి రావు,  ఉప కలెక్టర్లు సూర్య నారాయణ, పద్మావతి,  స్వీకరించారు. అనంతరం కలెక్టర్ అధికారుల తో మాట్లాడుతూ ఏ ఒక్క స్పందన దరఖాస్తు కూడా గడువు దాటి ఉండకుండా చూడాలని అన్నారు. అధికారులు స్పందన లాగిన్ లో స్వయంగా వినతులు పరిశీలించి, సమాధానం నాణ్యత ఉండేలా పరిష్కారం చేయా లన్నారు.

         వికలాంగుల కోటా లో ఉద్యోగాలకు ప్రత్యేకంగా జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా ఒకరికి స్పందన లో సోమవారం  పోస్టింగ్ ఆర్డర్ కలెక్టర్ అందజేశారు.  ప్రభుత్వ శాఖల్లో నున్న ఖాళీలను వెంటనే కలెక్టరేట్ కు తెలియజేయాలన్నారు.  జూన్ 3 న డి.ఆర్.సి సమావేశం జరగనున్నదని, అధికారులంతా గత సమావేశంలో ప్రస్తావించిన అంశాల కు సమాధానాలతో రావాలని సూచించారు.