13.12.2025 తేదీన జరగబోయే జాతీయ లోక్ అదాలత్ ను వినియోగించుకోవాలని పిలుపునిచ్చిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి
Publish Date : 13/11/2025
13.12.2025 తేదీన జరగబోయే జాతీయ లోక్ అదాలత్ ను వినియోగించుకోవాలని పిలుపునిచ్చిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి *
విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు గౌరవనీయులు
శ్రీమతి ఎం భ బి త గారు అధ్యక్షతన సీనియర్ సివిల్ జడ్జ్ మరియు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి శ్రీ ఏ కృష్ణ ప్రసాద్ గారు యొక్క ఆధ్వర్యంలో తేదీ 13.12.2025 న జరగబోయే జాతీయ లోక్ అదాలత్ కు సంబంధించి విజయనగరం జిల్లా మరియు పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ అధికారులతో జిల్లా కోర్టు సమావేశ మందిరంలో సమావేశమును ఏర్పాటు చేసిరి. ఈ సమావేశంలో గౌరవ జిల్లా జడ్జి గారు మాట్లాడుతూ రాజీ కాదగ్గ అన్ని క్రిమినల్ కేసులను చెక్ బౌన్స్ కేసులను గుర్తించి, స్పెషల్ డ్రైవ్ చేపట్టి వాటిని జాతీయ లోక్ అదాలత్ లో
పరిష్కరించాలని సూచించారు. తద్వారా కక్షిదారులకు డబ్బు సమయం వృధా కాదని తెలియజేశారు. పోలీస్ అధికారులు వారెంట్ పెండింగ్ ఉన్న కేసులలోనూ గంజాయి కి సంబంధించిన కేసులలో మరియు పోక్సో యాక్ట్ కి సంబంధించిన కేసులలో ముద్దాయిలకు అవగాహన కల్పించాలని తద్వారా నేరాలు తగ్గుముఖం పడతాయని తెలియజేశారు .ఈ సమావేశంలో డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ ఆర్ గోవిందరావు విజయనగరం మరియు పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ అధికారులు అధికారులు పాల్గొన్నారు.
జారీ చేయువారు
జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ విజయనగరం

131125-A