Close

163 petitions for response, Public Problem Solving Forum Response, District Collector A. Suryakumari

Publish Date : 25/03/2022

స్పందనకు 163 అర్జీలు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన

జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి

విజయనగరం మార్చి, 21:: ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో పలు శాఖలకు సంబంధించి ప్రజల నుండి అధిక సంఖ్యలో 163 అర్జీలు అందాయి. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి, సంయుక్త కలెక్టర్లు డా.మహేష్ కుమార్, మయూర్ అశోక్, డి.ఆర్.ఓ. గణపతిరావు ప్రజల నుండి వినతులను స్వీకరించారు. డి.ఎం.హెచ్.ఓ.కు 22, డి.ఆర్.డి.ఎ.కు 8, అందగా రెవిన్యూకు 133 దరఖాస్తులు వచ్చాయి. స్పందనలో వచ్చిన వినతులను పరిశీలించి నిర్ణీత గడువులోగా ఖచ్ఛితమైన సమాచారంతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్.ఎల్.ఎ. పరిధి దాటిన ధరఖాస్తులను 24 గంటల నుండి 48 గంటల లోపల పరిష్కరించాలన్నారు. హౌసింగ్, ఎం.జి.ఎన్.ఆర్.ఇ.జి.ఎస్., గోకులం, పెండింగులో వున్న పనులన్నింటిని వేగవంతంగా చేపట్టాలన్నారు. ఏప్రిల్ 2న రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల అప్రిషియేషన్ ప్రోగ్రాం (పిఎపి) జరుగునున్న సందర్భంగా సంబంధిత మండల ప్రత్యేక అధికారులు గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో మార్చి 22 తేదీ లోగా ప్రోగ్రాం షెడ్యుల్ ను తయారు చేయాలన్నారు.

స్పందనలో జిల్లా అధికారులు హాజరయ్యారు.

163 petitions for response, Public Problem Solving Forum Response, District Collector A. Suryakumari