Close

18.11.2025-ఆదర్శ సోలార్ గ్రామం గా బొద్దాం ఆమోదం కోటిరూపాయల వ్యయం తో నెడ్కాప్ ద్వారా అభివృద్ధి – జిల్లా స్థాయి కమిటీ లో కలెక్టర్ రాంసుందర్ రెడ్డి.

Publish Date : 19/11/2025

పత్రికాప్రకటన
ఆదర్శ సోలార్ గ్రామం గా బొద్దాం ఆమోదం
కోటిరూపాయల వ్యయం తో నెడ్కాప్ ద్వారా అభివృద్ధి –
జిల్లా స్థాయి కమిటీ లో కలెక్టర్ రాంసుందర్ రెడ్డి.
విజయనగరం నవంబర్ 18 : జిల్లా లో సోలార్ యూనిట్లు స్థాపన లక్ష్యాలు సకాలం లో సాధించాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి సూర్యాఘర్ పథకం అమలు పై జిల్లా స్థాయి కమిటీ సమావేశం కలెక్టరేట్ లో జరిగింది. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సోలార్ విద్యుత్ స్థాపన చేసిన తదుపరి మనం సాధారణ విద్యుత్ తో సమాంతరంగా సోలార్ విద్యుత్ వినియోగించుట వలన సోలార్ ద్వారా పొందిన విద్యుత్ తో తిరిగి ఆదాయం పొందవచ్చని అన్నారు. గ్రామస్థాయి లో సోలార్ విద్యుత్ వినియోగం పెరిగేందుకు జిల్లా లో 5వేల మంది జనాభా ఉన్న 6 గ్రామాలను ప్రయోగాత్మకంగా తీసుకుని వాటిలో ప్రజా ప్రయోజనార్థం ఎక్కువ సోలార్ పానన్లు అమర్చిన బొద్దాం గ్రామాన్ని ఆదర్శ సోలార్ గ్రామంగా కమిటీ గుర్తించిందని అన్నారు.
            నెడ్కాప్ ద్వారా సమగ్ర నివేదిక అందినతదుపరి కోటిరూపాయల వ్యయంతో ఉచితం గా సోలార్ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటుచేయడం జరుగుతుందని తెలిపారు.
         ప్రతి మండలానికి 10 గ్రామాలను ఎంపికచేసుకుని విద్యుత్ శాఖ, పంచాయతీ శాఖ సోలార్ విద్యుత్ వినియోగం అందువలన కలిగే ప్రయోజనం ప్రజలకు చేరవేసేందుకు ఇంటింటికీ వెళ్లి వివరించాలని అన్నారు.
     జిల్లాలో ఇప్పటివరకు 3307 సోలార్ యూనిట్లు అమర్చడం జరిగిందని అదేవిధంగా మొదటి విడత గా 19814 ఎస్ సి/ ఎస్ టి గృహాల పై విద్యుత్ శాఖ అమర్చిన సోలార్ పానళ్లకు అడుగుకు రూపాయి చొప్పున రెండువందల అడుగుల పానళ్లకు నెలకు రెండువందల రూపాయలు అద్దెరూపం లో చెల్లిస్తారని సూపరిటెండెంట్ ఇంజనీర్ లక్ష్మణ రావు కమిటీకు వివరించారు .
         బ్యాంకర్లు నిర్ణీత సమయం లో లబ్ధిదారులకు రుణాలు అందించాలని కలెక్టర్ కోరారు .
      ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్లు , జిల్లా పరిషత్ సి.ఈ.ఓ సత్యనారాయణ, డి పి ఓ మల్లికార్జున రావు,బాంక్ అధికారులు,  హౌసింగ్ అధికారులు, సోలార్ విద్యుత్ వెండర్స్, ఏ.డి లు, ఏ.ఈ లు తదితరులు పాల్గొన్నారు.
———————————————
జారీ: జిల్లా సమాచార పౌరసంబంధాల అధికారి.
18-11-1

18-11-1

18-11-2

18-11-2

18-11-3

18-11-3