Close

180 requests for Spandana, Joint Collector Mayur Ashok unveiled the poster

Publish Date : 21/06/2022

👉స్పందనకు 180 వినతులు
👉పోస్టర్ ను ఆవిష్కరించిన సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్
విజయనగరం, జూన్ 20: సోమవారం కలెక్టరేట్ నందు నిర్వహించిన స్పందన  కు ప్రజల నుండి 180 వినతులు అందాయి. వీటిలో వైద్య శాఖకు 20,  డి.ఆర్.డి.ఏ కు 10 అందగా  రెవిన్యూ కు సంబంధించి 150 వినతులు అందాయి. ముఖ్యంగా  సదరం, పింఛన్లు, ఇళ్ల స్థలాలు, గృహాల కోసం విజ్ఞప్తులు వచ్చాయి. ఈ వినతులు   సంయుక్త కలెక్టర్  మయూర్ అశోక్, జిల్లా రెవిన్యూ అధికారి గణపతి రావు,  ఉప కలెక్టర్ పద్మా వతి, సూర్యనారాయణ స్వీకరించారు.
👉బాలల రక్షణ పై పోస్టర్ విడుదల::
బాలలను బాల కార్మికులుగా మార్చవద్దు, చదువుకునేలా సహకరిద్దాం  బాలల హక్కుల రక్షణ మనందరి బాధ్యత అనే నినాదాలతో నేచర్ సంస్థ ఆధ్వర్యంలో ముద్రించిన పోస్టర్ ను జె.సి మయూర్ స్పందన లో ఆవిష్కరించారు. బలకార్మికుల చట్టంను అతిక్రమించి బాలలను పనిలో పెడితే శిక్షార్హులని ఈ సందర్బంగా పేర్కొన్నారు.  ఎప్పుడైనా, ఎక్కడైనా సంరక్షణ అవసరమైన బాలలను గుర్తిస్తే 1098 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయాలన్నారు.
ఈ పోస్టర్ విడుదల కార్యక్రమం లో డి .ఎం. హెచ్. ఓ  డా.రమణ కుమారి, ఐ సి డి ఎస్ పి.డి  శాంత కుమారి, ఎస్ ఎస్ ఏ. పి.ఓ స్వామినాయుడు , డిసిపిఓ లక్ష్మీ, నేచర్ నుండి దుర్గ తదితరులు పాల్గొన్నారు.
180 requests for Spandana, Joint Collector Mayur Ashok unveiled the poster