Close

19.11.2025 *పట్టణం లో ఆటోమేటిక్ టెస్టింగ్ యంత్రం ఏర్పాటుచేయాలి *పట్టణాల్లో రహదారులు ఎప్పటికప్పుడు శుభ్రపరచాలి* ఎన్ సి ఎ పి ప్రమాణాలకు లోబడి కాలుష్యం ఉండాలి* ఎన్ సి ఎ పి జిల్లా కమిటీ మీటింగ్ లో కలెక్టర్ఎస్.రాంసుందర్ రెడ్డి

Publish Date : 21/11/2025

పత్రికాప్రకటన-6

*పట్టణం లో ఆటోమేటిక్ టెస్టింగ్ యంత్రం ఏర్పాటు చేయాలి

*పట్టణాల్లో రహదారులు ఎప్పటికప్పుడు శుభ్రపరచాలి

*ఎన్ సి ఎ పి ప్రమాణాలకు లోబడి కాలుష్యం ఉండాలి

*ఎన్ సి ఎ పి జిల్లా కమిటీ మీటింగ్ లో కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి

విజయనగరం నవంబర్ 19 : పట్టణాల్లో ఎన్ సి ఎ పి ప్రమాణాలకు లోబడి కాలుష్యం ఉండాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తన ఛాంబర్ లో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో రహదారులు ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేయాలని మునిసిపల్ కమీషనర్ ను ఆదేశించారు. విజయనగరం పట్టణంలో వాహన కాలుష్యం కొలిచేందుకు ఆటోమేటిక్ టెస్టింగ్ మెషీన్లను ఏర్పాటు చేయాలని రవాణా అధికారులకు సూచించారు.

         విజయనగరం పట్టణం లో ప్రమాణాలకు పైబడి కాలుష్య విలువలు గుర్తించడం జరిగిందని,  కాలుష్యం తగ్గించేందుకు అధికారులు చొరవ తీసుకోవాలని అదేశించారు.

         2024-25 ఆర్థిక సంవత్సరం లో కేటాయించిన 2.8 కోట్లు నిధులు విజయనగరం నగరపాలక సంస్థ వద్ద ఉన్నాయని వాటితో పెండింగ్ లో ఉన్నపనులు అయిన పార్కులు అభివృద్ధి, ఎభైవేల మొక్కల పంపిణీ, వివిధ రహదారుల విస్తరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

         ఈసంవత్సరానికి గాను మహారాజా ఆసుపత్రి నుండి రైతుబజార్ వరకు ఉన్న రహదారి విస్తరణ పనులకు రూ 1.5 కోట్లు నిధులు కమిటీ ఆమోదించింది.

      ఈ సమావేశం లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్యావరణ ఇంజనీర్ బి. సరిత , మునిసిపల్ కమీషనర్ నల్లనయ్య, డిసిఎస్ఓ మురళీనాథ్, ఏపిఐఐసి జోనల్ మేనేజర్ మురళీమోహన్, డిహెచ్ఓ చిట్టిబాబు , ఏంవిఐ దుర్గాప్రసాద్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

=========

జారీ : జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, విజయనగరం

19-11-1

19-11-1

19-11-2

19-11-2