19.11.2025 *రైతు సంక్షేమమే ముఖ్యమంత్రి ధ్యేయం *అధిక లాభాలు వచ్చే పంటలు పండించేందుకు రైతులు మొగ్గు చూపాలి -జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి *2.27 లక్షల రైతులకు 150 కోట్లు అన్నదాత సుఖీభవ విడుదల
Publish Date : 21/11/2025
పత్రికాప్రకటన-4
*రైతు సంక్షేమమే ముఖ్యమంత్రి ధ్యేయం
*అధిక లాభాలు వచ్చే పంటలు పండించేందుకు రైతులు మొగ్గు చూపాలి -జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి
*2.27 లక్షల రైతులకు 150 కోట్లు అన్నదాత సుఖీభవ విడుదల
విజయనగరం నవంబర్ 19 : ఈ సంవత్సరం అధికవర్షాలు నమోదు కావడం వలన జిల్లా వ్యాప్తంగా వరి పంట అధికదిగుబడి సాధించామని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అన్నారు. వేపాడ తహసిల్దార్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటుచేసిన అన్నదాత సుఖీభవ-పి ఏం కిసాన్ రెండవ విడత నిధులు విడుదల కార్యక్రమంలో కలెక్టర్ రాంసుందర్ రెడ్డి, ఎస్.కోట శాసనసభ్యురాలు శ్రీమతి కోళ్ళ లలిత కుమారి పాల్గొని అన్నదాత సుఖీభవ -పి ఎం కిసాన్ పథకం కింద జిల్లా లో 2.27 లక్షల రైతులకు 150 కోట్లు నిధులు విడుదల చేసారు. అంతకు ముందు ప్రధాని, ముఖ్యమంత్రి వారి ప్రత్యక్ష ప్రసారాన్ని తిలకించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ రైతు సంక్షేమమే ముఖ్యమంత్రి ధ్యేయమని,రైతుకోసం నిరంతరం కృషి చేస్తున్నారని రైతులకు ఆర్ధిక లబ్ధి చేకూరేందుకు అన్నదాత సుఖీభవ పథకం ప్రవేశపెట్టారని తెలిపారు. వరిపంటకు ఎంత యూరియా అవసరమో అంతే వాడాలని సూచించారు. రైతులు వరి సాగులో ఎక్కువ యూరియా ఉపయోగించడం వలన దానియెక్క రసాయనిక దుష్ప్రభావం మనుషులపై పడి ఆరోగ్య సమస్యలు వస్తాయని గుర్తుచేశారు. సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం, బిందు సేద్యం రైతుకు లాభదాయకమని అన్నారు. వరితో పాటు అధికలాభాలు ఇచ్చే ఇతర పంటల సాగు పై దృష్టి పెట్టాలని తద్వారా ప్రతి రైతు ఉన్నత స్థితికి చేరుకోగలరని ఆశాభావం వ్యక్తం చేసారు.
ధాన్యం సేకరణ కేంద్రాన్ని ఎంఎల్ఎ కోళ్ల లలిత కుమారితో కలిసి ప్రారంభించారు.జిల్లాలో నాలుగు లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం పెట్టుకున్నట్లు వివరించారు .
ఎస్ కోట శాసనసభ్యురాలు కోళ్ళ లలిత కుమారి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలుచేస్తున్న అన్నదాత సుఖీభవ-పి ఏం కిసాన్ పథకం రైతుకు బాసటగా నిలుస్తుందని అందుకోసం రాష్ట్రవ్యాప్తం గా రెండు విడతల్లో 6 వేల కోట్ల రూపాయిలు ఖర్చుపెట్టినట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల గడువుకు ముందే రైతు ఖాతా లో నగదుజమ చేస్తున్న ఘనత ఈ ప్రభుత్వానిది అని అన్నారు. రాష్ట్రంలో చిన్న మధ్య తరహా పరిశ్రమల స్థాపనలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు స్థాపించుటకు ఈ రాష్ట్రప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలిపారు.
ఈకార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ, వేపాడ పిఎసిఎస్ చైర్మన్ జి ఎస్ నాయుడు, దాసరి కమ్యూనిటీ వెల్ఫేర్ చైర్మన్ రత్నాజి, కూటమి నాయకులు, పెద్దయెత్తున రైతులు పాల్గొన్నారు.
——————————————————
జారీ: జిల్లా సమాచార పౌరసంబంధాల అధికారి. విజయనగరం

19-11-1

19-11-2

19-11-3

19-11-4