Close

21.11.2025 *అనాథ బాలలకు భవిష్యత్తు నిర్మిద్దాం.*బాల్య వివాహాలు అరికట్టాలి.*భేటీ బచావో భేటీ పడావో నినాదం ప్రచారం చేయాలి.మిషన్ వాత్సల్య కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ఎస్.రాంసుందర్ రెడ్డి

Publish Date : 22/11/2025

పత్రికా ప్రకటన-7

*అనాథ బాలలకు భవిష్యత్తు నిర్మిద్దాం.

*బాల్య వివాహాలు అరికట్టాలి.

*భేటీ బచావో భేటీ పడావో నినాదం ప్రచారం చేయాలి.

మిషన్ వాత్సల్య కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి.

విజయనగరం అక్టోబర్ 22 : అనాథ బాలల సంరక్షణ కోసం గ్రామస్థాయి కమిటీలు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అనాథ బాలల సంక్షేమం పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వ మిషన్ వాత్సల్య కార్యక్రమం కింద జిల్లా కమిటీ సమావేశం కలెక్టరేట్ లో జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఉన్న పాఠశాల్లలో ఇప్పటివరకు మూడు వందల ఎభై మంది విద్యార్థులు బడి మానేశారని వారి వివరాలు సేకరించి తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా విద్యాశాఖాధికారికి ఆదేశించారు. టీనేజ్ ప్రెగ్నెన్సీ ను అరికట్టేందుకు గ్రామస్థాయి కమిటీలు చొరవ తీసుకొని ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి బాల్య వివాహాల వలన కలిగే అనర్థాలు అర్థమయ్యేటట్లు వివరించాలని కోరారు. అందుకు భాద్యత గల సిబ్బందిని నియమించాలని అన్నారు. బాల బాలిక వసతి గృహాల్లో సరైన పౌష్టికాహారం అందించాలని లేనియెడల సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. ఇప్పటి వరకు శిశు గృహం నుండి ఎభై ఆరు మంది చిన్నారులను దత్తత ఇచ్చినట్లు వివరించారు. ప్రస్తుతం శిశుగృహం లో ఐదుగురు చిన్నారులు ఉన్నారని తెలిపారు.

    ఈసందర్భంగా కలెక్టర్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సమక్షం లో పిల్లలు లేని దంపతులకు ఒక శిశువును బంధుత్వ దత్తత స్వీకారం అధికారికం గా చేశారు . అదేవిధంగా శిశు గృహం సంరక్షణ లో ఇద్దరు శిశువులకు దేవాన్షు, శాన్విక అని నామకరణం చేసారు.

       గౌరవ జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కృష్ణప్రసాద్ వారి సమక్షం లో మిషన్ వాత్సల్య పథకం లో తల్లిదండ్రులను కోల్పోయిన ఎనిమిది మంది పిల్లలతో ముఖా ముఖి కార్యక్రమము నిర్వహించారు. వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. విద్యాభ్యాసం, ఆరోగ్యం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఒక్కొక్కరికి కేంద్ర ప్రభుత్వం పదిలక్షలు రాష్ట్ర ప్రభుత్వం పదిలక్షలు కలిపి 20 లక్షలు వారి ఉన్నత చదువులకు ఇరవై మూడు సంవత్సరాలు దాటిన తదుపరి నగదు వారి ఖాతాల్లో జమచేయబడుతుందని వివరించారు.

         ఈకార్యక్రమం లో ఐసిడిఎస్ పిడి విమలా రాణి, డిఈఓ మాణిక్యం నాయుడు, డిఎంఎచ్ఓ కె రాణి, డిసిహెచ్ఎస్ పద్మశ్రీ రాణి, డిసిఎల్ ప్రసాదరావు ఇతర అధికారులు పాల్గొన్నారు.

జారీ : జిల్లా సమాచార పౌరసంబంధాల అధికారి. విజయనగరం

21-11-1

21-11-1

21-11-2

21-11-2

21-11-3

21-11-3

21-11-4

21-11-4