Close

21.11.2025 పక్షి ప్రమాద రహితంగా భోగాపురం విమానాశ్రయం 👉జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి

Publish Date : 22/11/2025

పత్రికా ప్రకటన-2

పక్షి ప్రమాద రహితంగా భోగాపురం విమానాశ్రయం

జిల్లా కలెక్టర్  రాంసుందర్ రెడ్డి

విజయనగరం, నవంబర్ 21 :   భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పక్షి ప్రమాద రహితంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. మొట్టమొదటి ఏరోడ్రోమ్ ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్ కమిటీ (AEMC) సమావేశం కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన శుక్రవారం జరిగింది. ప్రకృతికి అనుకూలంగా సురక్షితమైన, సుస్థిరమైన విమానాశ్రయ వాతావరణాన్ని కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అంతర్జాతీయ విమానయాన భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా, విమానాశ్రయం చుట్టూ పది కిలోమీటర్ల పరిధిలో పక్షి ప్రమాదం లేని ప్రాంతాన్ని సృష్టించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టాలని ఆదేశించారు.

            విమానాశ్రయానికి సమీపంలో పశువులు, వన్యప్రాణుల ప్రమాద నిర్వహణ, చెత్త, వ్యర్థాల తొలగింపు, వాటి నియంత్రణకు పటిష్టమైన చర్యలను అమలు చేయాలని ఆదేశించారు. దీనికోసం స్థానిక పరిపాలన యంత్రాంగానికి, విమానాశ్రయ నిర్వహణ సంస్థకు మధ్య పరస్పర సహకారం ఉండాలన్నారు. ఈ మేరకు విమానాశ్రయం సమీపంలోని ఈఓపిఆర్డీలకు, ఎంపీడీవోలకు, పంచాయతీ కార్యదర్శులకు తగిన ఆదేశాలను జారీ చేయాలని డిపివో కు సూచించారు. పర్యావరణ భద్రత, నిర్వహణలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఒక మోడల్ గా తీర్చిదిద్దాలని కలెక్టర్ కోరారు.

            ఈసమావేశంలో  భోగాపురం విమానాశ్రయం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ లక్కీ వర్మ భాస్కర్, ప్రాజెక్ట్ హెడ్ బిహెచ్ఎ రామరాజు, పర్యావరణ నిపుణులు ఏజెడి కార్తీక్, వన్యప్రాణి రక్షణ నిపుణులు బిభూ పాండే, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జీవన రాణి, ఆర్డీవో డి.కీర్తి, పొల్యూషన్ ఇంజనీర్ సరిత, డిపివో మల్లిఖార్జునరావు, డీఎఫ్వో రామ్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.

…………,…………………………………………………..

జారి : జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి, విజయనగరం.

21-11-1

21-11-1

21-11-2

21-11-1