249 applications for Spandana response, number of applications will decrease if resolution is expedited, District Collector A. Surya Kumari
Publish Date : 26/10/2021
స్పందన కు 249 అర్జీలు
పరిష్కారం వేగంగా జరిగితే ఆర్జీల సంఖ్య తగ్గుతుంది
జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి
విజయనగరం, అక్టోబర్ 25: ప్రజా వినతుల పరిష్కారానికి ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమం లో సోమవారం పలు శాఖలకు సంబంధించి 249 వినతులు అందాయి. ఈ వినతులను జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి, సంయుక్త కలెక్టర్ లు డా. జి.సి.కిషోర్ కుమార్, డా. మహేష్ కుమార్, మయూర్ అశోక్, జే,వెంకట రావు, డి.ఆర్.ఓ గణపతి రావు, డి.పి.ఎం పద్మావతి అందుకున్నారు. డి.సి.హెచ్ ఎస్ కు 25, డి.ఎం.హెచ్.ఓ కు 6, డి.ఆర్.డి.ఎ కు 51, అందగా రెవిన్యూ కు 116 దరఖాస్తులు వచ్చాయి. మాన్యువల్ గా మరో 51 దరఖాస్తులు నమోదయ్యాయి.
తొలుత జిల్లా కలెక్టర్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ ఒకే అంశం పై ఒకే అర్జీ దారు రెండవ సారి రాకుండా పరిష్కారం జరగాలని ఆదేశించారు. అలా జరిగితే కలక్టరేట్ కు వచ్చే అర్జీల సంఖ్య కూడా తగ్గుతుందని అన్నారు. స్పందన దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత నిచ్చి పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అన్నారు. ఈ సందర్భంగా శాఖ ల వారీగా పెండింగ్ వివరాలను చదువుతూ రెవిన్యూ, గ్రామీణాభివృద్ధి, పంచాయతి రాజ్ తదితర శాఖలలో నిర్ణీత గడువు దాటి పెండింగ్ ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కారం అయ్యేలా చూడాలని అన్నారు.
క్రీడాకారులను అభినందించిన కలెక్టర్:
జాతీయ స్థాయ లో హ్యాండ్ బాల్ పోటీలలో ఆంధ్ర ప్రదేశ్ తరపున పాల్గొని కాంస్య పతకాన్ని సాధించిన విద్యార్ధి ఎం. సత్యం ను కలెక్టర్ అభినందించారు. కొప్పెర్ల బాలయోగి కళాశాలలో ఎం.పి.సి. ద్వితీయ సంవత్సరం చదువుతున్న సత్యం ను కళాశాల ప్రిన్సిపాల్ నారాయణ తీసుకొని రాగా వారికీ అభినందనలు తెలిపారు.
మాస్టర్ ప్లాన్ అభ్యంతరాలను వెంటనే తెలియజేయండి:
వి.ఎం.ఆర్.డి.ఎ తయారు చేసిన మాస్టర్ ప్లాన్ లో అభ్యంతరాలు ఉంటే వెంటనే రాత పూర్వకంగా అందజేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ముఖ్యంగా ఆర్ అండ్ బి, పంచాయతి రాజ్, జలవనరులు, గ్రామీణ నీటి సరఫరా, విద్య శాఖలకు ఈ మాస్టర్ ప్లాన్ తో ఎలాంటి నష్టాలూ జరుగుతున్నా వెంటనే వివరాలను అందజేయాలన్నారు. ఇప్పటికే అన్ని మండల తాసీల్దార్ల కార్యాలయాల్లో మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ డిస్ప్లే చేయడం జరిగిందని, దీని ఆధారంగా జిల్లాలో ఏ శాఖకు ఎలాంటి నష్టం వాటిల్లినా తెలియజేస్తే మార్చడానికి వీలవుతుందని పేర్కొన్నారు. వారి రాత పూర్వక అభ్యంతరాల కాపీ ని జే.సి. రెవిన్యూ కిషోర్ కుమార్ కు అందజేయాలని తెలిపారు.