Close

25.01.2026 ఉత్తమ ఎన్నికల నిర్వహణ పురస్కారాన్ని అందుకున్న జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి* *​విజయవాడలో ఘనంగా జరిగిన జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు* *​కలెక్టర్‌తో పాటు పురస్కారాలు అందుకున్న రెవెన్యూ అధికారి మురళి, బిఎల్వో సత్యనారాయణ

Publish Date : 27/01/2026

పత్రికా ప్రకటన

*​ఉత్తమ ఎన్నికల నిర్వహణ పురస్కారాన్ని అందుకున్న జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి*
*​విజయవాడలో ఘనంగా జరిగిన జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు*
*​కలెక్టర్‌తో పాటు పురస్కారాలు అందుకున్న రెవెన్యూ అధికారి మురళి, బిఎల్వో సత్యనారాయణ*
​విజయనగరం/విజయవాడ, జనవరి 25: ఎన్నికల నిర్వహణలో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు గాను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్. రాంసుందర్ రెడ్డి రాష్ట్ర స్థాయి పురస్కారాన్ని అందుకున్నారు. శనివారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి వేడుకల్లో ఆయన ఈ పురస్కారాన్ని స్వీకరించారు.
​జిల్లాలో ఓటరు జాబితా రూపకల్పన, ఓటర్ల నమోదు ప్రక్రియ మరియు ఎన్నికల విధుల్లో అత్యుత్తమ విధానాలను అమలు చేసినందుకు గాను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం విజయనగరం జిల్లాను ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిఇఓ వివేక్ యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయానంద్, విశ్రాంత సిఇఓ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేతులమీదుగా జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఈ విశిష్ట పురస్కారాన్ని అందుకున్నారు.
       జిల్లా ​కలెక్టర్‌తో పాటు బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ కింద విజయనగరం జిల్లా రెవెన్యూ అధికారి ఈ. మురళి కూడా ఉత్తమ ఎన్నికల నిర్వహణ పురస్కారాన్ని స్వీకరించారు. అలాగే, గజపతినగరం నియోజకవర్గం బొండపల్లి మండలం 161వ పోలింగ్ కేంద్రం స్థాయి అధికారి ఎల్. సత్యనారాయణ ఉత్తమ క్షేత్ర స్థాయి అధికారిగా రాష్ట్ర స్థాయి పురస్కారాన్ని అందుకున్నారు.
         ​జాతీయ ఓటర్ల దినోత్సవం నాడు విజయనగరం జిల్లాకు ఇన్ని రాష్ట్ర స్థాయి పురస్కారాలు దక్కడం పట్ల జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు మరియు అధికారులు సంతోషం వ్యక్తం చేస్తూ కలెక్టర్ కు, ఇతర అధికారులకు అభినందనలు తెలిపారు.
​……………………..
జారీ: జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి, విజయనగరం.

25-1

25-1