28.12.2025 ప్రతి సోమవారం రెవెన్యూ క్లినిక్* జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి
Publish Date : 29/12/2025
పత్రికా ప్రకటన
*ప్రతి సోమవారం రెవెన్యూ క్లినిక్*
జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి
విజయనగరం, డిసెంబర్ 28: ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం ఉదయం 10.00 గంటలకు రెవెన్యూ క్లినిక్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
ముగ్గురు రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్లు తప్పనిసరిగా ఉదయం 10.00 గంటలకు కలెక్టరేట్‌లో నిర్వహించే రెవెన్యూ క్లినిక్‌కు హాజరుకావాలని ఈ సందర్బంగా కలెక్టర్ ఆదేశించారు.
అదేవిధంగా ఆర్‌డీఓ కార్యాలయాలు, తహసీల్దార్ కార్యాలయాలలో దరఖాస్తులు స్వీకరించేందుకు సంబంధిత ఏఓ, డీటీ లు అందుబాటులో ఉండాలని సూచించారు.
తహసీల్దార్ కార్యాలయాల్లో నిర్వహించే రెవెన్యూ క్లినిక్‌కు మండల సర్వేయర్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, గ్రామ రెవెన్యూ అధికారులు తమకు సంబంధించిన అన్ని రికార్డులతో తప్పనిసరిగా హాజరుకావాలని తెలిపారు.
రైతులు మరియు ప్రజలు తమ భూసంబంధిత సమస్యలు, రెవెన్యూ సమస్యలను ఈ రెవెన్యూ క్లినిక్ ద్వారా పరిష్కరించుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
============
జారీ : జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, విజయనగరం

28-12-127-12-1